'నోకియా సడన్ సర్‌ప్రైజ్ ' ఏరోజు..?

Posted By: Staff

'నోకియా సడన్ సర్‌ప్రైజ్ ' ఏరోజు..?

 

ఒకప్పుడు ప్రపంచ మొబైల్ మార్కెట్‌ని శాసించిన నోకియా, ఇటీవల కాలంలో విడుదలైన ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ దెబ్బకు కొంత వరకు నోకియా మార్కెట్ కుదేలయిన విషయం తెలిసిందే. తిరిగి నోకియా తన పూర్వ వైభవాన్ని సంపాదించుకునేందుకు గాను, మైక్రోసాప్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో చేతులు కలిపి మార్కెట్లోకి మైక్రోసాప్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నోకియా వరల్డ్ మీటింగ్‌లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి కొన్ని మొబైల్ ఫోన్స్‌ని ప్రపంచానికి పరిచయం చేసింది.

ఇప్పడు కొత్తగా నోకియా అమ్ముల పోదిలోకి మరో విండోస్ ఆధారిత మొబైల్ ఫోన్ వచ్చి చేరింది. ఈ విషయాన్ని నోకియా కంపెనీ అధికారకంగా ప్రకటించకపోయినప్పటికీ, ఇంటర్నెట్లో విడుదలైన 'నోకియా 900 ఏస్' మొబైల్ ఫోన్‌ వీడియోని బట్టి తెలుస్తుంది. నోకియా 900 ఏస్ మొబైల్ ఫోన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి స్మార్ట్ ఫోన్. దీని ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 1.4 GHz CPUతో పాటు, 1 GB of RAMని నిక్షిప్తం చేయడం జరిగిం ది. కెమెరా విషయానికి వస్తే ఇందులో 8 మెగా ఫిక్సల్ కెమెరాని అమర్చడం జరిగిందని సమాచారం.

నోకియా 900 ఏస్ మొబైల్ ఫోన్ మైక్రోసాప్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. అంతేకాకుండా నోకియా 900 ఏస్ మొబైల్‌లో డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేసినట్లు సమాచారం. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 4.3 ఇంచ్‌లుగా స్క్రీన్ డిస్ ప్లేని రూపొందించడం జరిగింది. ఈ స్క్రీన్ డిస్ ప్లే ప్రత్యేకత ఏంటంటే దీనిని AMOLED టెక్నాలజీతో రూపొందించడం జరిగింది.

మొబైల్‌తో పాటు 16జిబి మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకోవచ్చు. కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్ వర్సన్ 4.0ని, వై - పై(Wi-Fi 802.11 b/g/n/)ని సపోర్ట్ చేస్తుంది. ఇటీవల కాలంలో నోకియా మొబైల్ కంపెనీ విడుదల చేస్తున్న ప్రతి హై ఎండ్ మొబైల్ ఫోన్‌లోను ఎన్‌ఎఫ్‌సి టెక్నాలజీని నిక్షిప్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక నోకియా మొబైల్ బ్యాటరీ బ్యాక్అప్ గురించి చెప్పాల్సిన పని లేదు. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో 1800 mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది.

పైన పేర్కోన్న నోకియా 900 ఏస్ ప్రత్యేకతలు అన్ని కూడా నోకియా కంపెనీ అధికారకంగా ప్రకటించ లేదు. నోకియా 900 ఏస్ వీడియోని చూసి పాఠకులకు తెలియజేయడం జరుగుతుంది. దీనిని గమనించవలసిందిగా మనవి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting