వీటి రాకతో 50 శాతం షేర్ మార్కెట్ మాకే: నోకియా

Posted By: Staff

వీటి రాకతో 50 శాతం షేర్ మార్కెట్ మాకే: నోకియా

నోకియా మొబైల్స్ ఇండియాలో అతి పెద్ద మొబైల్ మార్కెట్ షేర్‌ని కలిగి ఉంది. ఈ మార్కెట్ షేర్‌ని 2012కల్లా 50శాతానికి తీసుకొని వెళ్లాలన్నదే తమ టార్గెట్ అని ఇటీవల ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో నోకియా ప్రతినిధి తెలిపారు. లండన్‌లో ఈ వారంలో జరగిన 'నోకియా వరల్డ్ 2011' కాన్పరెన్స్‌లో నోకియా ఆరు మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే.

నోకియా విడుదల చేసిన ఆరు మొబైల్ ఫోన్స్‌లలో నాలుగు 'నోకియా ఆశా సిరిస్' క్రింద విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్‌ఫోన్స్‌కి ఎటువంటి ఫీచర్స్ ఐతే ఉన్నాయో సరిగ్గా అలాంటి ఫీచర్స్‌‍ ఇమడింపజేసి వీటిని మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మిగిలిన రెండు మొబైల్ ఫోన్స్ హై ఎండ్ విభాగంలో విడుదల చేయనున్నాయి. నోకియా విడుదల చేయనున్న హై ఎండ్ స్మార్ట్ పోన్స్..

* నోకియా లుమియా 710
* నోకియా లుమియా 800

నోకియా ఆశా సిరిస్ క్రింద విడుదల చేసిన మొబైల్ ఫోన్స్ ధరలు వరుసగా రూ 4,100, రూ 8,000గా ఉండనున్నాయి. అదే నోకియా లుమియా మొబైల్ ఫోన్స్(710, 800) ధరలు మాత్రం రూ 19,000, రూ 29,000లుగా ఉండనున్నాయని తెలిపారు. ఇండియా జనాభా ప్రస్తుతం 1.2 బిలియన్, దేశం మొత్తం మీద సుమారు 800 మిలియన్ మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు. ఇప్పటికే ఇండియాలో ఉన్న మద్యతరగతి ప్రజలు నోకియా మొబైల్స్‌ని ఎక్కువగా వాడుతున్న విషయం తెలిసిందే.

ఆసియా మార్కెట్లో యాపిల్ ఐఫోన్ పోటీని తట్టుకునేందుకు గాను నోకియా ఈ లుమియా సిరిస్ మొబైల్ ఫోన్స్‌(710, 800)ని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఈ సందర్బంలో నోకియా ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ డి శివకుమార్ మాట్లాడుతూ ఇండియన్ మార్కెట్లో ఎవరు పడితే వారు ఆడడం కష్టం. ఆట ఎలా ఆడాలో తెలిసిన వారు మాత్రమే ఈజీగా సక్సెస్ అవుతారని తెలిపారు.

నోకియా లుమియా 710 మొబైల్ ప్రత్యేకతలు:

* 1.4GHz Qualcomm MSM8255 processor
* Adreno 205 GPU
* 512MB of RAM
* 3.7” WVGA 480

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting