టి-మొబైల్ ద్వారా అమెరికాలో 'నోకియా లుమియా 710'

Posted By: Prashanth

టి-మొబైల్ ద్వారా అమెరికాలో 'నోకియా లుమియా 710'

 

ప్రపంచ వ్యాప్తంగా మొబైల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న నోకియా మొట్టమొదటి సారి రూపొందించిన మైక్రోసాప్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ స్మార్ట్ ఫోన్ 'నోకియా లుమియా 710' సిరిస్‌ని అమెరికా మూడవ అతి పెద్ద మొబైల్ క్యారియర్ టి-మొబైల్ ద్వారా పరిచయం చేయనుంది. ఈ విషయాన్ని ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఓ ఈవెంట్ ద్వారా తెలియజేశారు.

వచ్చే వారం టి-మొబైల్ ద్వారా విడుదల కానున్న ఈ నోకియా లుమియా 710 స్మార్ట్ ఫోన్ ధర యూరప్‌లో €270($362)గా నిర్ణయిండమైందని తెలిపారు. ఐతే అమెరికాలో మాత్రం దీని ధరను ఇంకా వెల్లడించ లేదు. టి-మొబైల్ క్యారియర్ మొట్టమొదటి సారి నోకియాతో కలసి ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేస్తుండడంతో అమెరికాలో 'నోకియా 710' స్మార్ట్ ఫోన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే టి-మొబైల్ కస్టమర్స్ నోకియా లుమియా 710 స్మార్ట్ ఫోన్ విడుదల తర్వాత నోకియా లుమియా 800ని తప్పకుండా కోరుకుంటారని అన్నారు.

'నోకియా లుమియా 710' స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు:

* 480 x 800 pixels, 3.7 inches screen

* Microsoft Windows Phone 7.5 Mango OS

* Gorilla Glass screen

* 8 GB storage, 512 MB RAM

* 5 MP rear-facing camera with autofocus, and LED flash

* 720p@30fps recording

* 1.4 GHz Scorpion CPU, Qualcomm MSM8255 Snapdragon

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot