సంచలనం రేపుతోన్న నోకియా ఆండ్రాయిడ్ ఫోన్..?

ఫీచర్ ఫోన్‌ల విభాగంలో నోకియా బ్రాండ్ సంచలనాలు మనందరికి తెలుసు. ఒకప్పటి నెం.1 మొబైల్ తయారీ బ్రాండ్ అయిన నోకియా కాలక్రమంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో ఏర్పడి పోటీ వంటి అంశాల కారణంగా మార్కెట్లో వెనకబడిపోయింది.

సంచలనం రేపుతోన్న నోకియా ఆండ్రాయిడ్ ఫోన్..?

Read More : మీ ఫోన్‌లో ఫేస్‌బుక్ యాప్‌ను ఓపెన్ చేయకుండా, ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను వాడుకోవటం ఎలా?

మైక్రోసాఫ్ట్ వంటి పెద్దపెద్ద సంస్థలు నోకియాను గాడిలో పెట్టే పయత్నం చేసినప్పటికి ఫలితం లేకుండా పోయింది. తాజాగా నోకియాతో హెచ్ఎండీ గ్లోబల్‌తో ఎగ్రిమెంట్‌ను కుదుర్చుకుంది. నోకియా బ్రాండ్ పేరుతో మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేయడంతో పాటు విశ్వవ్యాప్తంగా విక్రయించుకునేందుకు హెచ్ఎండీ గ్లోబల్‌ సిద్ధమవుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మూడు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఈ ఏడాది చివరి నాటికి నోకియా నుంచి మూడు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యాకు చెందిన ప్రముఖ డిజైనర్ Vasili Sychev ఆసక్తికర నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ కాన్సెప్ట్ తో ముందుకొచ్చారు.

Nokia Prism..

Nokia Prism పేరుతో ఈయన డిజైన్ చేసిన కాన్సెప్ట్ చూడటానికే చాలా కొత్తగా అనిపిస్తోంది.

ఫోన్‌‌లా అనిపించటంలేదు

Prism షేపులో ఉన్న ఈ నోకియా ఫోన్ కాన్సెప్ట్ అసలు ఫోన్‌‌లా అనిపించటంలేదు. ఒక ఆర్ట్‌లా అనిస్తోంది.

పొదునైన వొంపులతో..

పొదునైన వొంపులతో వస్తోన్న ఈ ఫోన్‌ను చేతిలో హ్యాండిల్ చేయటం కుదరదు. అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది.

అడ్డదిడ్డమైన డిజైనింగ్‌తో..

అడ్డదిడ్డమైన డిజైనింగ్‌తో కనిపిస్తోన్న ఈ కాన్సెప్ట్ ఫోన్‌కు నోకియా అభిమానుల నుంచి షాకింగ్ కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia Prism: Will This Weird Phone be the Upcoming Nokia Android Phone?. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting