నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసింది!

Posted By:

నోకియా అభిమానులకు శుభవార్త.  ఇప్పటి వరకు విండోస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే అందించిన నోకియా తాజాగా ‘నార్మాండీ' (normandy) పేరుతో తన మొట్టమొదటి ఆండ్రాయిడ్  స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. వచ్చే నెలలో నిర్వహించే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా నోకియా ఈ ఆండ్రాయిడ్ హ్యాండ్‌సెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశముంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వివరాలను వియాత్నాంకు చెందిన ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ The Giodidong.com తన జాబితాలో పేర్కొంది. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసింది!

డ్యుయల్ సిమ్ సపోర్ట్,
4 అంగుళాల FWVGA స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
గూగుల్ ప్లేస్టోర్, యూట్యూబ్ వంటి ప్రీలోడెడ్ ఫీచర్లను ఫోన్‌లో ముందుగా నిక్షిప్తం చేసినట్లు సమాచారం.

ఈ ఫోన్ విడుదలకు సంబంధించిన వివరాలు తర్వలోనే వెల్లడవుతాయి. మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot