6జీబి ర్యామ్, 128జీబి స్టోరేజ్.. హడలెత్తిస్తున్న నోకియా ఫోన్?
మరికొద్ది రోజుల్లో లాంచ్ కాబోతున్న నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి మరో సంచలన న్యూస్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. పాకెట్‌లింట్ రిపోర్ట్స్ ప్రకారం నోకియా స్టన్నింగ్ స్పెక్స్‌తో కూడిన ఓ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్థి చేస్తోంది.
Read More : రిమూవబుల్ బ్యాటరీతో వచ్చే ఫోన్‌లతో లాభమా, నష్టమా?

Snapdragon 835 చిప్‌సెట్
నోకియా పీ పేరుతో లాంచ్ కాబోతున్న ఈ ఫోన్ 6జీబి ర్యామ్‌తో పాటు శక్తివంతమైన Snapdragon 835 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని లీకైన రిపోర్ట్ చెబుతోంది.
(కాన్సెప్ట్ ఫోటో)

128జీబి ఇంటర్నల్ స్టోరేజ్...
23 మెగా పిక్సల్ కెమెరాతో వస్తోన్న ఈ ఫోన్ ఏకంగా 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంటుందట. యాపిల్, సామ్‌సంగ్‌లకు పోటీగా నోకియా అభివృద్థి చేస్తున్న ఈ హై-ఎండ్ ఫోన్ 5.2 లేదా 5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిన్ డిస్‌ప్లేతో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశముందట.
(కాన్సెప్ట్ ఇమేజ్)

నోకియా సీ1
నోకియా సీ1 పేరుతో ఈ ఫోన్ చైనా సోషల్ మీడియా నెట్‌వర్క్ Weiboలో లీకైంది. నోకియా ఎన్1 టాబ్లెట్‌కు దగ్గర పోలికలను కలిగి ఉన్న ఈ డివైస్ ప్రీమియమ్ మెటల్ లుక్‌తో స్లీక్ బాడీని సంతరించుకుని ఉంది.
(కాన్సెప్ట్ ఇమేజ్)

నోకియా సీ1 స్పెసిఫికేషన్స్ (అన్ అఫీషియల్)
5 అంగుళాల డిస్‌ప్లే (720 పిక్సల్ రిసల్యూషన్), ఇంటెల్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా. ఈ ఫోన్ కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే విడుదలయ్యే అవకాశముంది. ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 16 ఎంపీ + 12ఎంపీ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, Snapdragon 830 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి, 128జీబి) .
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








