మొట్టమొదటి నోకియా విండోస్ ఫోన్: నోకియా సీ రే రివ్యూ

Posted By: Staff

మొట్టమొదటి నోకియా విండోస్ ఫోన్: నోకియా సీ రే రివ్యూ

నోకియా ప్రపంచం మొత్తం మీద ఎక్కవ మొబైల్ ఫోన్స్‌ని ఉత్పత్తి చేసేటటువంటి సంస్ద. ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో నోకియా ప్రత్యేకత వేరు. అందుకే డజన్లు కొద్ది ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో తనయొక్క ఉత్పత్తులను విడుదల చేస్తుంది. అందుకు కారణం రాబోయే ఐదు సంవత్సరాలలో ఇండియన్ మొబైల్ మార్కెట్ ప్రపంచంలో ఉన్నటువంటి మొబైల్ మార్కెట్‌తో పోల్చితే 40శాతం అభివృద్దిని సాధిస్తుందని నిపుణులు అంచనా.. ప్రస్తుతం దేశంలో ఆండ్రాయిడ్ స్మార్ట్ పోన్స్ హాడావుడి ఎక్కువగా ఉండడంతో నోకియా కూడా తమయొక్క ఉత్పత్తులను సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ నుండి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు మారిన సంగతి తెలిసిందే.

త్వరలో నోకియా విడుదల చేయనున్నటువంటి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్ గురించి కంపెనీ సిఈవో స్టీఫెన్ ఎలాప్ మాట్లాడుతూ మార్కెట్ లోకి త్వరలో విడుదల చేయనున్నటువంటి ఈ విండోస్ ఫోన్ ఓ కొత్త ఒరవడి సృష్టిస్తుందని అన్నారు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం స్టీఫెన్ ఎలాప్ కొంత మంది అతిధులకు మాత్రమే నోకియా విండోస్ ఫోన్ పని తీరుని వివరించిన వీడియో హాంగేరియన్ వెబ్ సైట్ టెక్‌నెట్. హెచ్‌యు తన వెబ్ సైట్‌లో ఉంచడం జరిగింది. ఆ వీడియో ప్రకారం నోకియా విడుదల చేయనున్నటువంటి ఆ కొత్త ఫోన్ పేరు నోకియా సీ రే. అచ్చం ఇది చూడడానికి నోకియ ఎన్ 9 మాదిరి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

ఈ విండోస ఫోన్ విడుదల అవ్వగానే నోకియా కంపెనీ పెద్ద సక్సెస్‌ని సాధించడమే కాకుండా పూర్వ వైభవాన్ని కూడా తిరిగి సంపాదించుకుంటుందని భావించారు. ఇటీవల కాలంలో నోకియా తమయొక్క కంపెనీ నుండి ఎకానమీ క్లాస్ స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేయనున్నామని తెలిపిన సంగతి తెలిసిందే. ఇండియాలో ఉన్న కామన్ మ్యాన్‌కి అనుకూలంగా డ్యూయల్ సిమ్ మోడళ్లతో రెండు మోడళ్ల(నోకియా సి2-03, నోకియా సి2-06)ను విడుదల చేయడం జరిగింది. వాటితో పాటు ఇప్పుడు అధనంగా నోకియా విండోస్ ఫోన్ విడుదల చేస్తే ఎప్పటిలాగే నోకియా తన పూర్వ వైభవాన్ని స్మార్ట్ ఫోన్స్‌కి తట్టుకోని నిలబడుతుందని భావన.

Nokia Sea Ray Specs:

* Windows Phone 7 Mango OS
* Qualcomm MSM8255 SoC with Adreno 205 GPU
* 512MB or 1GB of LP-DDR2 Ram & 1GB of Rom
* 16/32Gb or 64GB of iNAND internal storage
* GPRS/EDGE: 850/900/1800/1900
* 8MP camera with Carl Zeiss Optics with Dual-LED Flash and can shoot 720P video at 30fps
* Wide-angle lens with F2.2 aperture, continual auto-focus, Focal length: 3.77mm / 28mm
* 3.7/3.8 or 4 ClearBlack AMOLED WVGA display with 2.5D curved Gorilla Glass and Anti-glare polariser
* Precision-crafted Unibody Polycarbonate frame
* Bluetooth 2.1 +EDR
* Wifi b/g/n
* 3.5mm audio Jack
* Micro-USB port
* Size: 116.45 x 61.2 x 7.6-12.1 mm
* Weight (with battery): 135 g

కొన్ని టెక్నాలజీ బ్లాగ్‌ల ప్రకారం విండోస్ ఫోన్ 7 ఫిబ్రవరి 2011కల్లా మార్కెట్ లోకి రావచ్చుననే అభిప్రాయం.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot