నోకియా 3.5 కోట్ల ఫోన్‌లు అమ్మేసింది

ఒకప్పుడు మొబైల్ మార్కెట్‌ను శాసించిన ఫీచర్ ఫోన్లు మరోసారి ప్రపంచ మార్కెట్లలో సత్తాచాటే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటు భారత్‌లోనూ ఫీచర్ ఫోన్‌ల హవా నడుస్తోంది. 2016లో ప్రపంచవ్యాప్తంగా 39.6 కోట్ల ఫీచర్ ఫోన్‌లు అమ్ముడుపోగా అందులో 5.2 కోట్ల ఫోన్‌లను సామ్‌సంగ్ విక్రయించింది.

 నోకియా 3.5 కోట్ల ఫోన్‌లు అమ్మేసింది

Read More : నోకియా 6 గ్లోబల్ వర్షన్ ఇదే, ఇండియా రిలీజ్ ఎప్పుడంటే..?

రెండవ స్ధానంలో నిలిచిన నోకియా 3.5 కోట్ల ఫీచర్ ఫోన్‌లను విక్రయించగలిగింది. మూడువ స్ధానంలో నిలిచిన టీసీఎల్ 2.8 కోట్ల ఫోన్‌లను విక్రయించగలింది. 2016కుగాను 13 శాతం మార్కెట్ వాటాను సామ్‌సంగ్ కైవసం చేసుకోగా, నోకియా 9శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుంది. నోకియా హక్కులను హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ సొంతం చేసుకున్న నేపథ్యంలో నోకియా ఫీచర్ ఫోన్ మార్కెట్ మరింతగా పెరిగే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌ఫోన్‌ల విలువ నెలకు తుస్..

ప్రతి వస్తువుకు మార్కెట్లో ఓ విలువనేది ఉంటుంది. కానీ స్మార్ట్‌ఫోన్‌ల విషయంలో మాత్రం ఈ విలువ చాలా ప్రత్యేకం. మార్కెట్లోకి విడుదలయ్యే కొత్త కార్ల విలువ ఏడాదిలో 20 శాతం వరక తగ్గుతూ ఉంటే, స్మార్ట్‌ఫోన్‌ల విలువ మాత్రం నెలకు 65 శాతం తగ్గిపోతోందని పడిపోతున్నట్లు మ్యూజిక్‌మాగ్‌పీ.కో.యూకే  నివేదిక ఇటీవల వెల్లడించింది.

ఐఫోన్‌లతో పోలిస్తే...

అంటే మనం ముచ్చటగా వేలకు వేలు పోసి కొన్న స్మార్ట్‌ఫోన్ విలువ నెలకే సగానికి పడిపోతుందన్నమాట. ఈ సర్వేలో మరిన్ని ఆసక్తికర విషయాలు బహిర్గతమవటం విశేషం. ఈ సర్వేలో మరిన్ని ఆసక్తికర విషయాలు బహిర్గతమవటం విశేషం. ఐఫోన్‌లతో పోలిస్తే ఆండ్రాయిడ్ ఫోన్‌ల విలువ మరింత తగ్గిపోతున్నట్లు ఈ సర్వే చెప్పుకొచ్చింది.

ఐఫోన్ 4 మార్కెట్లో విడుదలై..

ఐఫోన్ 4 మార్కెట్లో విడుదలై 6 సంవత్సరాలు కావొస్తున్నప్పటికి, ఈ డివైస్ మార్కెట్ విలువ 39శాతంగా ఉందట. ఐఫోన్ 6 మార్కెట్లో విడుదలైన సంవత్సరం తరువాత, ఆ ఫోన్ మార్కెట్ వాల్యూ 50 శాతంగా ఉందట. ఐఫోన్ 5 మార్కెట్లో విడుదలైన 8 నెలలకే 66శాతం మార్కెట్ వాల్యూను కోల్పొయిందట.

సామ్‌సంగ్ ఫోన్స్ విషయంలో..

2014లో విడుదలైన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మార్కెట్ విలువ రెండు నెలలకే సగానికి పడిపోయిందట. 2015లో విడుదలైన హెచ్‌టీసీ వన్ ఎం9 విలువ నెలరోజులకే 65 శాతానికి పడిపోయిందట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia ships 35 million feature phones, stands next to Samsung. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting