ఫోల్డబుల్ డిస్‌ప్లేలను ప్రదర్శించిన నోకియా

Posted By:

స్మార్ట్‌ఫోన్‌లను సరికొత్ ట్రెండ్ వైపు తీసుకువెళ్తూ ఎల్‌జి, సామ్‌సంగ్ వంటి మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీలు ఏడాది క్రితం ఎల్‌జి జీ ఫ్లెక్స్, సామ్‌సంగ్ గెలాక్సీ రౌండ్ మోడల్స్‌లో రెండు కర్వుడ్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. తాజాగా ఈ రేసులోకి నోకియా వచ్చి చేరింది.

ఫోల్డబుల్ డిస్‌ప్లేలను ప్రదర్శించిన నోకియా

శాన్‌డిగోలో జరిగిన ‘రీసెంట్ సొసైటీ ఫర్ డిస్‌ప్లే ఇన్ఫర్మేషన్ కాన్ఫిరెన్స్'లో భాగంగా నోకియా ప్రోటోటైప్ దశలో ఉన్న రెండు ఫోల్డబుల్ డిస్‌ప్లేలను ప్రదర్శించింది. ఈ 5.9 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లేల రూపకల్పనలో భాగంగా నోకియా, సెమీ కండెక్టర్ ఎనర్జీ లాబరేటరీతో కలిసి పనిచేసింది.

వీటిలో మొదటి ప్యానల్‌ను పస్తుకంలా రెండుగా మడత పెట్టుకోవచ్చు. రెండవ ప్యానల్‌ను మూడు మడతలుగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ 5.9 అంగుళాల ఓఎల్ఈడి ప్యానల్స్ 1,280 x 720పిక్సల్  రిసల్యూషన్‌ను కలిగి ఉంటాయి. 249 పీపీఐ పిక్సల్ డెన్సిటీ. ఈ ప్రత్యేకమైన డిస్‌ప్లే ప్యానల్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను నోకియా ఎప్పుడు విడుదల చేస్తుందో వేచి చూడాలి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot