నోకియా ఫోన్‌ల పై ధరల తగ్గింపు..?

Posted By: Prashanth

Nokia slashes Lumia 800, 900 Prices..?

 

నోకియా అభిమానులకు శుభవార్త.. లూమియా సిరీస్ నుంచి ఇటీవల విడుదలైన లూమియా 900, 800 విండోస్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను 10 నుంచి 15శాతం వరకు తగ్గిస్తున్నట్లు నోకియా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రముఖ బ్రిటీష్ రిసెర్చ్ సంస్థ సీసీఎస్ తాజాగా బహిర్గతం చేసిన సమాచారం మేరకు లూమియా 800 పై 15శాతం, లూమియా 900 పై 10శాతం ధర తగ్గింపును అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నోకియా ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన విండోస్8 స్మార్ట్‌ఫోన్‌లు లూమియా 920, 820లు నవంబర్ నుంచి అందుబాటులోకి వస్తున్న నేపధ్యంలో లూమియా 900, 800 అమ్మకాలను సాధ్యమైనంత మేరకు ముమ్మరం చేసేందకు ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరో వైపు వరుస నష్టాలను చవిచూస్తున్న నోకియాకు విడుదల కాబోతున్న నోకియా లూమియా 920, 820 స్మార్ట్‌ఫోన్‌లు నూతన ఉత్తేజాన్ని నింపగలవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

లూమియా 920 కీలక ఫీచర్లు:

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,

నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్‌సీ) టెక్నాలజీ,

వై-ఫై,

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (నోకియా ప్యూర్ వ్యూ టెక్నాలజీ),

1.3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,

1జీబి ర్యామ్,

32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

మైక్రోయూఎస్బీ పోర్ట్,

శక్తివంతమైన 2,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

క్యఐ వైర్‌లెస్ పవర్ స్టాండర్డ్.

లూమియా 920 ఎల్లో, రెడ్, వైట్, గ్రే, బ్లా వంటి వైబ్రెండ్ కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది. భారత్ మార్కెట్లో లూమియా 920 నవంబర్ లేదా డిసెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting