నోకియా స్మార్ట్ బుయ్ బ్యాక్ ఆఫర్!
రాబోయే దసరా, దీపావళి పండుగ సీజన్‌లను పురస్కరించుకుని నోకియా సరికొత్త స్మార్ట్ బుయ్ బ్యాక్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఈ ఆఫర్‌లో భాగంగా నోకియా లూమియా 925 ఇంకా లూమియా 625 స్మార్ట్‌ఫోన్‌లను ఎక్సేంజ్ ఆఫర్లో పొందవచ్చు. ఈ ఎక్సేంజ్ ఆఫర్లో భాగంగా కొనుగోలుదారుడు తన పాత స్మార్ట్‌ఫోన్‌ను సమర్పించి నోకియా లూమియా 925 కొనుగోలు పై రూ.10,000 వరకు, లూమియా 625 మోడల్ స్మార్ట్‌ఫోన్ పై రూ.7,000 వరకు రాయితీలను పొందవచ్చు.

ఈ స్మార్ట్ బుయ్ ఆఫర్‌లో భాగంగా వినియోగదారుడు అంతిమంగా నోకియా లూమియా 925 మోడల్‌ను రూ.28,529కి, లూమియా 625 ఫోన్ ను రూ.14,919 ధరకు పొందగలుగుతాడు. ప్రస్తుత ఆన్‌లైన్ మార్కెట్లో నోకియా లూమియా 925 మోడల్‌ను రూ.33,499కి, లూమియా 625 ఫోన్‌ను రూ 16,290కి విక్రయిస్తున్నారు.
నోకియా స్మార్ట్ బుయ్ బ్యాక్ ఆఫర్‌కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి:
నోకియా లూమియా 925 ప్రధాన స్పెసిఫికేషన్‌లు:
4.5 అంగుళాల ప్యూర్ మోషన్ హైడెఫినిషన్+ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1,280 x 768పిక్సల్స్, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, వై-ఫై, 3జీ, క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ (ఆప్షనల్), నియర్ఫీల్డ్ కమ్యూనికేషన్, 8.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్), ఏ-జీపీఎస్ కనెక్టువిటీ, 2000 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
నోకియా లూమియా 625 ప్రధాన స్పెసిఫికేషన్ లు:
ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించనట్లయితే 4.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్లస్ ఎమ్ఎస్ఎమ్ ప్రాసెసర్, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 5మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, నోకియా మ్యూజిక్, 3జీ హెచ్ఎస్ పీఏ+, వై-ఫై 902.11 బి/జి/ఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, ఏజీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications