Home
Mobile

నోకియా ఫోన్‌లకు జనవరి సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌

నోకియా సంస్థ స్మార్ట్‌ఫోన్‌ రంగంలోకి అడుగు పెట్టిన తరువాత ఈ నెల ప్రారంభంలో తన నోకియా 4.2 మరియు నోకియా 7.2 స్మార్ట్‌ఫోన్‌ల కోసం జనవరి 2020 భద్రతా అప్‌డేట్‌ను విడుదల చేస్తున్నట్లు హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ ప్రకటించింది. వీటితో పాటుగా నోకియా 8.1, నోకియా 6, నోకియా 5.1 , నోకియా 5, మరియు నోకియా 2.2 ఫోన్ల కోసం కూడా కంపెనీ అదే అప్‌డేట్‌ను అందిస్తున్నది.

అప్‌డేట్‌

తాజా అప్‌డేట్‌లో భాగంగా నోకియా 8.1 ఫోన్ సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ను QKQ1.190725.002 కు పెంచుతుంది. ఇది 31MB పరిమాణంలో ఉంటుంది. నోకియా 5.1 సాఫ్ట్‌వేర్ వెర్షన్ నంబర్ PDA-220F-0-00WW-B01 కు పెంచుతుంది. ఇది 58MB పరిమాణంలో ఉంటుంది.

 

 

బిల్డ్ నంబర్‌

మరోవైపు నోకియా 5 ఫోన్ TA-1024 వేరియంట్ కోసం బిల్డ్ నంబర్‌ను 394MB పరిమాణంలో 00WW_6_19B_SP01 కు తీసుకువస్తుంది. నోకియా 6 UIEలో 307.4MB పరిమాణంలో అప్‌డేట్‌ను పొందుతుండగా చివరగా నోకియా 2.2 నవీకరణ కొలంబియా వెర్షన్ లో విడుదలవుతోంది. దాని పరిమాణం 73.8MB గా ఉంది.

 

 

పరిష్కారాలు

పరిష్కారాలు

ఈ కొత్త అప్‌డేట్‌లో ఎటువంటి కొత్త ఫీచర్లు లేదా బగ్ పరిష్కారాలను తీసుకురాలేదు. ఇది జనవరి 2020 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌తో భద్రతా మెరుగుదలలను మాత్రమే కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌లో భాగంగా కొత్త ఫీచర్లు వస్తాయి. ఇది క్యూ 2 కి ముందు ఆండ్రాయిడ్ వన్ OSతో రన్ అవుతున్న అన్ని నోకియా పరికరాల కోసం విడుదలయ్యే అవకాశం ఉంది.

 

 

అప్‌డేట్‌

అప్‌డేట్‌

మొత్తం ఐదు నోకియా స్మార్ట్‌ఫోన్‌లకు దశల వారిగా కొత్త అప్‌డేట్‌ OTA గా విడుదల అవుతోంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌లలో దేనినైనా వాడుతూ ఉంటే కనుక అప్‌డేట్‌ను స్వయంచాలకంగా డౌన్‌లోడ్ చేయడానికి మీకు ఒక పుష్ నోటిఫికేషన్ వస్తుంది. అలా రాకపోతే కనుక దానికి ప్రత్యామ్నాయం కోసం సెట్టింగ్స్ -> సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ మెనుకి వెళ్లడం ద్వారా కూడా కొత్త అప్‌డేట్‌ను తనిఖీ చేయవచ్చు. అదనపు సెల్యులార్ డేటా ఛార్జీలను నివారించడానికి వినియోగదారులు వై-ఫై ద్వారా అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

 

 

జనవరి సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌ను  వివరాలు

జనవరి సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌ను వివరాలు

మొత్తం ఐదు నోకియా స్మార్ట్‌ఫోన్‌లలో తీవ్రమైన హానిని కలిగించే వాటిని పరిష్కరించడానికి తాజా సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌ ఉపయోగపడుతుంది. ఇది అదనపు అనుమతులకు యాక్సిస్ ను పొందడానికి వినియోగదారుడి ఇంటరాక్షన్ అవసరాలను దాటవేయడానికి స్థానిక హానికరమైన యాప్ ను ప్రారంభించగలదు. ఈ అప్‌డేట్‌ ఫోన్ యొక్క రిమోట్ సమాచార బహిర్గతంకు దారితీసే దోపిడీని కూడా పరిష్కరిస్తుంది. హెచ్‌ఎండి గ్లోబల్ ఈ జనవరి 2020 సెక్యూరిటీ ప్యాచ్‌ను రాబోయే వారాల్లో మరిన్ని నోకియా పరికరాలకు విడుదల చేసే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Nokia SmartPhones Receive January Security Patch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X