మర్డర్లు మొదలుకుని మిస్టరీ వార్తల వరకు..?

Posted By: Staff

మర్డర్లు మొదలుకుని మిస్టరీ వార్తల వరకు..?

నోకియా సింబియాన్ వినియోగదారులకు శుభవార్త... త్వరలో మీ హ్యాండ్‌సెట్‌లో సరొకొత్త రీడర్ అప్లికేషన్ అప్‌డేట్ కానుంది. ఈ అప్లికేషన్ ప్రపంచపు తాజా సమాచారాన్ని ఎప్పిటికప్పుడు మీ ఫోన్ హోమ్ స్ర్కీన్ పై ప్రదర్శిస్తుంది.

ఈ నిఫ్టి అప్లికేషన్ ఇతర సౌలభ్యతలు:

* సులువైన ఇంటర్నెట్ యాక్సిస్,


* హోమ్‌స్ర్కీన్ ఎప్పికప్పుడు తాజా వార్తాలతో నిండి ఉంటుంది,


* క్లౌడ్ స్టోరేజ్ సౌలభ్యత,


* స్థానిక మరియు అంతర్జాతీయ వార్తలను యాక్సెస్ చేసుకునే సదుపాయం,


* బ్యాటరీ ఫ్రెండ్లీ,


* ఆన్‌లైన్ డైరెక్టరీ,


* నోకియా బ్రౌజర్‌ను సపోర్ట్ చేస్తుంది.

ఈ తాజా సవరణ బ్యాటరీ బ్యాకప్ పై ఏ విధమైన ప్రభావం చూపబోదు. కేవలం రెండు క్లిక్స్‌తో అప్లికేషన్ లోకి లాగినై తాజా సమచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ సరికొత్త నోకియా రీడర్ అప్లికేషన్‌ను సింబియాన్ యూజర్లు సులువుగా సెటప్ చేసుకోవచ్చు. ఆ విధానాన్ని ఇప్పుడు చూద్దాం...

• ముందుగా హోమ్‌స్ర్కీన్ పై ఏదో ఒక భాగాన్ని వినియోగదారుడు నోక్కి ఉంచాలి.

• పిదప పర్సనలైజ్ వ్యూను ఎంపిక చేసుకోవాలి,

• ఆ తరువాత ఏ ప్రాంతంలో రీడర్ అప్లికేషన్ ఉండాలో డిసైడ్ చేసుకోండి,

• అనంతరం పాప్‌అప్ జాబితాలో ఉన్న నోకియా రీడర్‌ను క్లిక్ చేయండి,

• చివరిగా డన్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని ఎస్ బటన్‌ను క్లిక్ చేసి సెట్టింగ్‌లను సేవ్ చేసుకోవాలి,

ఈ నిబంధనలను పాటించినట్లయితే నోకియా రీడర్ అప్లికేషన్ ఎల్లప్పుడు మీ హామ్‌స్ర్ర్ర్కీన్ పై ఉంటుంది. ఈ అప్లికేషన్ ద్వారా వినియోగదారుడు ప్రయాణ సందర్భాల్లో సైతం విశ్వసనీయ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. పొందుపరిచిన ఆన్‌లైన్ డెరక్టరీ ఫీచర్ సాయంతో శ్రోత వివిధ ఛానళ్లతో పాటు భాషలను ఎంపిప చేసుకోవచ్చు. సిరీస్ 40 టచ్‌ఫోన్‌లు మొదలుకుని, నోకియా X3-02,ఆషా 303, C2-02, C3-01 మరియు ఆషా 300 హ్యాండ్‌సెట్‌లలో ఈ నిఫ్టీ రీడర్ అప్లికేషన్‌ను సమర్థవంతంగా పరీక్షించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot