నోకియా ‘కొత్త సిరీస్...కొత్త లుక్’!!!

Posted By: Prashanth

నోకియా ‘కొత్త సిరీస్...కొత్త లుక్’!!!

 

విశ్వసనీయతకు.. భరోసాకు నిలువెత్తు తార్కాణంగా నిలిచి అంతర్జాతీయంగా ఫర్ ఫెక్ట్ బ్రాండ్ గా ముద్రపడిన ‘నోకియా’ (Nokia) ఇప్పటికే ‘ఎన్’ సిరీస్, ‘ఇ’ సిరీస్ ల్లో మొబైల్ ఫోన్లను విడుదల చేసి విజయ డంఖా మోగించింది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో నోకియా వైభవం అంతా ఇంతా కాదు. అత్యధిక మొబైల్ అమ్మకాల పై కన్నేసిన నోకియా తాజాగా ‘టీ’ సిరీస్ లో మొబైల్ ఫోన్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ సిరీస్ లో మొట్టమొదటిగా వస్తున్న ‘టీ7’ మోడల్ ఫీచర్లు క్లుప్తంగా:

మొబైల్ స్ర్కీన్ సైజ్ 3.4 అంగుళాల, రిసల్యూషన్ 360 x640 పిక్సల్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, క్లియర్ బ్లాక్ డిస్ ప్లే, మల్టీ టచ్ సపోర్ట్, 1జీబి రోమ్, సిస్టం మెమరీ 256 ఎంబీ, ఎక్స్ ప్యాండబుల్ విధానం ద్వారా జీబిని 32జీబికి పెంచుకోవచ్చు. ఫోన్ కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత బలోపేతం జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై, హెచ్ఎస్ డీపీఏ వ్యవస్థలను నిక్షిప్తం చేశారు. 3జీ వ్యవస్థను నోకియా టీ7 సపోర్ట్ చేస్తుంది.

బ్లూటూత్ వర్షన్ 3.0, యూఎస్బీ 2.0 వర్షన్ కనెక్టువిటీ వ్యవస్థు టేటాను వేగవంతంగా షేర్ చేస్తాయి. 8 మెగా పిక్సల్ కెమెరా 3264 x 2448 పిక్సల్ రిసల్యూషన్ కలిగి ఉంటుంది. వీజీఏ వ్యవస్థతో సెకండరీ కెమెరాను ఏర్పాటు చేశారు. లితియమ్ ఐయాన్ బ్యాటరీ వ్యవస్ధ 360 గంటల స్టాండ్ బై సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

డివైజ్ పనితీరును వేగిరితం చేయ్యటంలో నిక్షిప్తం చేసిన ARM 11 ప్రాసెసర్ తోడ్పడుతుంది. ప్రాసెసర వేగం 680 MHz, పలు వాయిస్ కమాండ్లను డివైజ్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్ లో ఏర్పాటు చేసిన డాక్యూమెంట్ వ్యూవర్ అన్ని విధాల డాక్యుమెంట్ ఫైళ్లను సపోర్ట్ చేస్తుంది. ఇండియన్ మార్కెట్లో ‘నోకియా టీ7’ ధర రూ.15,000 ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot