నోకియా ట్యాబ్లెట్ వస్తుందోచ్...?

Posted By: Prashanth

నోకియా ట్యాబ్లెట్ వస్తుందోచ్...?

 

ఫీచర్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌ల తయారీ విభాగంలో ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నవిశ్వసనీయ బ్రాండ్ నోకియా, 2013 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా విండోస్ ఆర్‌టి ట్యాబ్లెట్ కంప్యూటర్‌ను ఆవిష్కరించనుందని డిగీటైమ్స్ నివేదికలు వెల్లడించాయి. 10 అంగుళాల శ్రేణిలో రూపుదిద్దుకుంటున్నఈ ట్యాబ్లెట్ మోడల్ వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ట్యాబ్లెట్ డివైజ్ యాపిల్ ఐప్యాడ్, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 800, గూగుల్ నెక్సస్10లకు ప్రధాన పోటీదారు కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఫీచర్లు (అంచనా):

విండోస్ ఆర్‌టి ప్లాట్ ఫామ్,

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో ప్రాసెసర్,

ధర అంచనా $399 (రూ. 21,900).

లూమియా 620 వచ్చే జనవరిలో!

యూత్‌ను టార్గెట్ చేస్తూ నోకియా డిజైన్ చేసిన విండోస్ ఫోన్ 8 స్మార్ట్‌ఫోన్ లూమియా 620 దేశీయ మార్కెట్లో జనవరి నుంచి లభ్యంకానుంది. ధర రూ.12,450. ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసిన కెమెరా స్సెసిఫికేషన్‌లు క్వాలిటీ ఫోటోగ్రఫీని చేరువచేస్తాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. లూమియా 620 కీలక ఫీచర్లు…… విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కెమెరా (5 మెగా పిక్సల్ రేర్, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా), స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్లస్ ప్రాసెసర్, మ్యాపింగ్ అప్లికేషన్స్ (నోకియా మ్యాప్స్, నోకియా డ్రైవ్, నోకియా ట్రాన్స్‌పోర్ట్, నోకియా సిటీ‌లెన్స్), నోకియా మ్యూజిక్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, లైవ్ టైల్స్, ఎక్స్‌బాక్స్ లైవ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, 7జీబి ఆన్‌లైన్ స్కై డ్రైవ్ స్టోరేజ్, ఇంటర్నెట్ ఎక్ప్‌ప్లోరర్ 10.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot