అమ్మయ్యా.. రేపే రిలీజ్!

Posted By: Staff

అమ్మయ్యా.. రేపే రిలీజ్!

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ద్వారా నోకియా ప్రకటించిన చవక ధర విండోస్ స్మార్ట్‍‌ఫోన్ ‘లూమియా 610’ను ఇండియాలో శుక్రవారం ఆవిష్కరించనున్నారు. అధికారికంగా నోకియా ఇండియా ఇటీవల వెల్లడించిన సమాచారం మేరకు లూమియా 610 అదేవిధంగా లూమియా 900 స్మార్ట్‌ఫోన్‌లు జూలై చివరా లేదా ఆగష్టు ప్రధమాకంలో విడుదల కావల్సి ఉంది. ఈ నేపధ్యంలో ప్రణాళికలను మార్చుకున్న నోకియా జూలై 6నే లూమియా 610ను భారత విపణిలో ప్రవేశపెట్టందుకు సన్నాహాలు పూర్తి చేసింది. ఈ ఫోన్ ధర అంచనా రూ.11,000.

లూమియా 610 ఫీచర్లు:

విండోస్ ఫోన్ టాంగో అకా 7.5 రిఫ్రెష్ ఆపరేటింగ్ సిస్టం,

800 మెగాహెట్జ్ ప్రాసెసర్, 256ఎంబీ ర్యామ్,

8జీబి ఇంటర్నల్ మెమెరీ,

5 మెగా పిక్సల్ కెమెరా,

నోకియా మ్యూజిక్, నోకియా మ్యాప్స్, నోకియా డ్రైవ్ వంటి అప్లికేషన్‌లను ముందుగానే హ్యాండ్‌సెట్‌లో లోడ్ చేశారు,

సియాన్, మాజింతా, బ్లాక్ ఇంకా తెలుపు రంగుల్లో లూమియా 601 లభ్యం కానుంది.

ధర అంచనా రూ.11,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot