ఇంకా క్లారిటీ లేదు..కొనసాగుతున్న సస్పెన్స్?

నోకియా నుంచి 41మెగా పిక్సల్ హై క్వాలిటీ కెమెరాతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న స్మార్ట్‌ఫోన్ ‘ప్యూర్ వ్యూ808’ ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి తేదీ ఖరారైనట్లు వార్తలు వినిపిస్తుండటంతో నోకియా అభిమానులు మధ్య సందడి వాతావరణం నెలకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ‘నోకియా ప్యూర్ వ్యూ 808’ను జూన్13న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ అంశానికి సంబంధించి నోకియా నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్‌ను ప్రకటించిన తేదీ నుంచి నేటి వరకు ధరకు సంబంధించిన వివరాలు బయటకు పొక్కుకుండా నోకియా వర్గాలు గోప్యత పాటిస్తున్నాయి. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ధర విషయంలో వ్యక్తమవుతున్న పుకార్లను నోకియా అధికార ప్రతినిధి ఒకరకు ఖండించిన విషయం తెలిసిందే. ఫోన్ ఆవిష్కరణ సమయంలో పూర్తి వివరాలను బహిర్గతం చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.
ఈ ఫోన్ మేలోనే విడుదల కావల్సి ఉన్నప్పటికి జాప్యానికి సంబంధించి వివరాలు తెలియరాలేదు. హ్యాండ్‌సెట్ విడుదలకు సంబంధించి వారం క్రిందట కౌంట్‌డౌన్ క్లాక్‌ను ఆరంభించిన నోకియా ఆ కౌంట్ డౌన్‌టైమ్ ముగుసినప్పటికి స్తబ్ధి వహిస్తుంది. 2012, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ద్వారా పరిచయమైన నోకియా ప్యూర్ వ్యూ 808 ఉత్తమ మొబైల్ అవార్డులను దక్కించుకున్న విషయం తెలిసిందే.
నోకియా 808 ప్యూర్ వ్యూ ముఖ్య ఫీచర్లు:
4 అంగుళాల ఆమోల్డ్ క్లియర్ బ్లాక్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 360 x 640పిక్సల్స్),
1.3గిగాహెడ్జ్ ఆర్మ్ ప్రాసెసర్,
512ఎంబీ ర్యామ్,
15జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
నోకియా బెల్లీ ఆపరేటింగ్ సిస్టం,
3జీ కనెక్టువిటీ,
వై-ఫై,
జీపీఎస్ సపోర్ట్,
బ్లూటూత్,
41 మెగాపిక్సల్ కెమెరా,
1080పిక్సల్ హై క్వాలిటీ వీడియో రికార్డింగ్,
32జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమరీ,
1400mAh లియాన్ బ్యాటరీ.

Click it and Unblock the Notifications