నోకియా ఫోన్లు భారత్‌లో తయారు కాబోతున్నాయా..?

సరిగ్గా, ఆరు సంవత్సరాల క్రితం భారత్‌లో ఒకేఒక్క నెం.1 మొబైల్ ఫోన్ బ్రాండ్ ఉండేది. అదే బ్రాండ్ నోకియా (Nokia).ఆ రోజుల్లో కుటుంబంలో ఒక్కరి దగ్గరైనా నోకియా ఫీచర్ ఫోన్ కనిపించేది. కాలక్రమంలో నోకియా ఫోన్‌లకు క్రేజ్ తగ్గుతూ వచ్చింది.

నోకియా ఫోన్లు భారత్‌లో తయారు కాబోతున్నాయా..?

Read More : నోకియా 6 ఇండియాలో దొరుకుతోంది, ధర ఎంతో తెలుసా..?

మైక్రోసాఫ్ట్ చేతుల్లోకి వెళ్లాకా ఈ పరిస్ధితి మారుతుందని అంతా భావించారు.అయితే, అనుకున్నదేమి జరగకపోగా నోకియా మొబైల్ ప్రొడక్షన్ పూర్తిగా నిలిచిపోయింది. సరిగ్గా మూడు సంవత్సరాల తరువాత HMD Global గూటికి చేరుకున్న నోకియా మరికొద్ది నెలల్లో ఆండ్రాయిడ్ వర్షన్‌తో ఇండియన్ మార్కెట్లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017లో కీలక వివరాలు..

విడుదలకు సిద్దమవుతోన్న నోకియా 5, నోకియా 3, నోకియా 3310..?

ఇండియాలో లాంచ్ కాబోతోన్న నోకియా ఆండ్రాయిడ్ ఫోన్లకు సంబంధించి నోకియా సీఈఓ రాజీవ్ సూరి, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017లో కీలక వివరాలను వెల్లడించనున్నారు.

నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో కూడా..?

ఇప్పటికే చైనా మార్కెట్లో సంచలన రేపుతోన్న నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌ను కూడా నోకియా భారత్ లోకి తీసుకువచ్చే అవకాశాలు కనపిస్తున్నాయి.

ఐఫోన్ 7 ప్లస్ పై రూ.12,000, ఐఫోన్ 7 పై రూ.10,000 తగ్గింపు

రూ.16,000 నుంచి రూ.20,000 మధ్య

నోకియా 6 ధర ఇండియన్ మార్కెట్లో రూ.16,000 నుంచి రూ.20,000 మధ్య ఉండొచ్చని సమాచారం. ఆన్ లైన్ అలానే ఆఫ్ లైన్ పద్ధతిలో కూడా నోకియా తన ఫోన్ లను విక్రయించే యోచనలో ఉన్నట్లు రూమర్ మిల్స్ చెబుతున్నాయి.

సామ్‌సంగ్‌తో భారీ డీల్ కుదుర్చుకున్న యాపిల్..?

భారత్‌లో నోకియా ఫోన్‌ల తయారీ..?

భారత్‌లో నోకియా ఫోన్‌ల తయారీ పై ఇప్పటి వరకు ఏ విధమైన అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అయితే, నోకియా స్మార్ట్‌ఫోన్‌ల తయారీదారైన Foxconn ఇప్పటికే భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కాబట్టి, త్వరలోనే ఈ అంశం తెరమీదకు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.

లోకల్ బ్రాండ్‌లకు డేంజర్ బెల్స్, చైనాదే ఇండియన్ మార్కెట్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia to re-enter India around April. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot