నోకియా స్టేట్‌మెంట్...వాళ్లని నిరుత్సాహాపరచం!

Posted By: Staff

 నోకియా స్టేట్‌మెంట్...వాళ్లని నిరుత్సాహాపరచం!

 

విండోస్ ఫోన్8  ఆపరేటింగ్ సిస్టం విడుదల నేపధ్యంలో విండోస్ 7.5 యూజర్లను నిరుత్సాహపరచబోమని నోకియా వర్గాలు ప్రకటించాయి. విండోస్ 8 ఆధారితంగా స్పందించే లూమియా 920 అదేవిధంగా  లూమియా 820 స్మార్ట్‌ఫోన్‌లు త్వరలో మార్కెట్లో విడుదులకాబోతున్న నేపధ్యంలో నోకియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్ఫష్టమవుతోంది. ఈ క్రమంలో విండోస్ 8 తరహాలో ఫీచర్లను విండోస్ 7.5 ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే లూమియా 900, లూమియా 800, లూమియా 710 డివైజ్‌లో పొందుపరచనున్నారు. ఎంపిక చేసిన మార్కట్‌‌లలో మాత్రమే ఈ అప్‌డేట్ లభ్యమవుతుందని మార్కెట్ వర్గాల టాక్.

ఈ అప్‌డేట్‌తో విండోస్ 7.5 ఫోన్‌లలో జత అయ్యే కొత్త ఫీచర్లు:

-  సరికొత్త స్టార్ట్ స్ర్కీన్,

-  కాంటాక్ట్ షేరింగ్ అప్లికేషన్,

-  బ్లూటూత్ ఫైల్ ట్రాన్స్ ఫర్,

-  స్మార్ట్ గ్రూప్ షాట్ ఫీచర్,

-  రింగ్‌టోన్ మేకర్ అప్లికేషన్.

Read in English:

త్వరలో విడుదల కానున్న  నోకియా లూమియా 920 ఫీచర్లు:

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్‌సీ) టెక్నాలజీ, వై-ఫై, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (నోకియా ప్యూర్ వ్యూ టెక్నాలజీ), 1.3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్, 1జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోయూఎస్బీ పోర్ట్, శక్తివంతమైన 2,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్యఐ వైర్‌లెస్ పవర్ స్టాండర్డ్.

లూమియా 920 ఎల్లో, రెడ్, వైట్, గ్రే, బ్లా వంటి వైబ్రెండ్ కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది. ఫోన్‌కు సంబంధించి పూర్తిస్థాయి స్పెసిఫికేషన్‌లతో పాటు ధర వివరాలు తెలియాల్సి ఉంది. భారత్ మార్కెట్లో లూమియా 920 నవంబర్ లేదా డిసెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting