మత్తెక్కిస్తున్న ఆషా!

ప్రఖ్యాత మొబైల్ తయారీ బ్రాండ్ నోకియా తనకు అచ్చొచ్చిన ఆషా సిరీస్ నుంచి మూడు టచ్ స్ర్కీన్ ఫోన్‌లను ఆవిష్కరించింది. వాటి పేర్లు ఆషా305, ఆషా 306, ఆషా 311. పూర్తి స్థాయి టచ్ ఆధారితంగా పనిచేసే ఈ ఫోన్‌లలో ఎస్40 ఆపరేటింగ్ సిస్టంను లోడ్ చేసారు. వీటితో ఆషా సిరీస్ నుంచి విడుదలైన ఫోన్‌ల సంఖ్య మొత్తం పది. ఈ ఫోన్‌లలో నిక్షిప్తం చేసిన ఎస్40 ఆషా టచ్ యూజర్ ఇంటర్‌ఫేస్ కొత్త మొబైలింగ్ అనుభూతికి లోను చేస్తుంది. ఈ మూడు హ్యాండ్‌సెట్లు నోకియా బ్రౌజర్ వర్సన్ 2.0ను సపోర్ట్ చేస్తాయి. ఈ సరికొత్త బ్రౌజింగ్ టెక్నాలజీ వెబ్‌సైట్ లోడింగ్‌ను మూడు రెట్టు వేగవంతంగా చేస్తుంది.
నోకియా ఆషా 305 ప్రధాన ఫీచర్లు:
- డ్యూయల్ సిమ్,
- రెసిస్టివ్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే,
- బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ కనెక్టువిటీ,
- 2 మెగా పిక్సల కెమెరా,
- ధర రూ.4,400.
నోకియా ‘మాస్టర్ మైండ్’!
స్మార్ట్‌ఫోన్ తెర పై సరళమైన రీతిలో పుస్తకాలను చదువుకునేందుకు వీలుగా నోకియా తన లూమియా సిరీస్ హ్యాండ్‌సెట్‌ల కోసం ఈ-బుక్ అప్లికేషన్‌ను డిజైన్ చేసింది. పేరు ‘నోకియ రీడింగ్’. మొట్టమొదటి సారిగా ఈ అనువర్తనాన్ని 2012, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదిక పై ప్రకటించారు.
విండోస్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టంకు ఈ నోకియా రీడింగ్ అప్లికేషన్ పూర్తి స్ధాయిలో సహకరిస్తుంది. తద్వారా, యూజర్లు కంటెంట్‌ను చదివే క్రమంలో ఏ విధమైన ఆసౌకర్యానికి గురికారు. తమ వినియోగదారులకు ఉత్తమ శ్రేణి ఈ-బుక్ రీడింగ్‌ను అందించే క్రమంలో, ప్రముఖ ప్రచరణకర్తలైన హచెట్-పియర్సన్, పెంగ్విన్ సంస్థలతో నోకియా కలిసి పనిచేస్తోంది. యూజర్ ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా వారి ఇష్టమైన రచయితల పుస్తకాలతో పాటు నచ్చిన నవలలను చదవచ్చు.
అంతేకాదు, స్థానిక భాషలలో ప్రచురితమైన పుస్తకాలను సైతం ఈ అప్లికేషన్ సౌలభ్యతతో వీక్షిణ లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తాజాగా విడుదలైన కొత్త పుస్తకాలకు సంబంధించిన వివరాలను ఈ అప్లికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. త్వరలో విడుదల కానున్న ‘నోకియా రీడింగ్ అప్లికేషన్’ లూమియా 900, 710,800,610 మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే వర్తిస్తుంది.


Click it and Unblock the Notifications