నోకియా నుంచి చవక ధర 3జీ ఫోన్‌లు

Posted By:

విశ్వసనీయ మొబైల్ తయారీ బ్రాండ్ నోకియా సరసమైన ధర శ్రేణిలో మూడు సరికొత్త 3జీ ఆధారిత హ్యాండ్‌సెట్‌లను ఆవిష్కరించింది. నోకియా 207, నోకియా 208, నోకియా 208 (డ్యూయల్ సిమ్) వేరియంట్‌లలో ఈ డివైజులు లభ్యంకానున్నాయి.

ఈ ఫోన్‌లు 2.4 అంగుళాల తెరను కలిగి ఉంటాయి. 2జీ ఇంకా 3జీ కనెక్టువిటీ సౌలభ్యత, బ్లూటూత్ 3.0 ఆప్షన్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ. నోకియా 208 ఇంకా నోకియా 208 (డ్యూయల్ సిమ్)మోడల్ ఫోన్‌లు ప్రత్యేకమైన 1.3 మెగాపిక్సల్ కెమెరాను కలిగి ఉంటాయి.

నోకియా ఎక్స్‌ప్రెస్ బ్రౌజర్, మెయిల్ ఆఫ్ ఎక్సేంజ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సౌకర్యాలను ఈ మూడు ఫోన్‌లలో కల్పించారు. శక్తివంతమైన 1020ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఈ డివైజ్‌లు మూడవ త్రైమాసికంలో మార్కెట్లోకి రానున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా నుంచి చవక ధర 3జీ ఫోన్‌లు

1.) నోకియా 207 (nokia 207):

2.4 అంగుళాల క్వాగా స్ర్కీన్,
256 ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
బ్లూటూత్ 3.0, 3.5జీ హెచ్ఎస్‌పీఏ,
1020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

నోకియా 208 (nokia 208)

2.) నోకియా 208 (nokia 208):

2.4 అంగుళాల క్వాగా స్ర్కీన్,
1.3 మెగా పిక్సల్ కెమెరా,
256 ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
బ్లూటూత్ 3.0, 3.5జీ హెచ్‌ఎస్‌పీఏ,
1020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

నోకియా 208 డ్యూయల్ (nokia 208 dual)

నోకియా 208 డ్యూయల్ (nokia 208 dual):

డ్యూయల్ సిమ్,
2.4 అంగుళాల క్వాగా స్ర్కీన్,
1.3 మెగా పిక్సల్ కెమెరా,
256 ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
బ్లూటూత్ 3.0, 3.5జీ హెచ్‌ఎస్‌పీఏ,
1020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot