నోకియా తక్కవ ఖరీదు లైనక్స్ స్మార్ట్ ఫోన్స్...

By Super
|
Nokia Linux Smartphones
మార్కెట్లో హై క్వాలిటీ ఉత్పత్తలను విడుదల చేస్తూ దీదీప్యమానంగా వెలుగొందుతున్న నోకియా ఎప్పటికప్పడు కొత్త పంధాని అవలంభిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు నోకియా విడుదల చేసిన ఉత్పత్తులలో క్వాలిటీ విషయంలో ఎటువంటి రాజీ పడని విషయం తెలిసిందే. ఐతే ఇటీవల కాలంలో మొబైల్ పరిశ్రమలో మొబైల్ తయారీదారులు ఎక్కవ అవ్వడం ఒక సమస్య కాగా, వాటి మద్య కాంపిటేషన్ కూడా బాగా పెరిగిపోయింది. దాంతో నోకియా మొబైల్ కంపెనీ కొన్ని ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అందుకే ఇటీవల నోకియా సుమారు 3500 ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.

ముఖ్యంగా నోకియా మార్కెట్లో చౌకబారు స్మార్ట్ ఫోన్స్‌ని తయారు చేస్తున్న హువాయ్, ఐబాల్, జి ఫైవ్ లాంటి కంపెనీల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటుంది. ఇలాంటి వాటన్నింటి పోటీని తట్టుకునేందుకు గాను నోకియా కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ 'మెల్టమీ'ని మార్కెట్లోకి విడుదల చేయనుంది. నోకియా కొత్తగా విడుదల చేయనున్న ఈ మెల్టమీ ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్ ప్లాట్ ఫామ్ ఆధారంగా తీసుకొని రూపొందించడం జరిగింది. దీనిని ఇప్పడు ప్రవేశపెట్టడానికి కారణం ఈ తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్‌తో తక్కవ ఖరీదు కలిగిన స్మార్ట్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేయవచ్చని తెలిపింది.

లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రూపొందించిన ఈ స్మార్ట్ ఫోన్స్ ధర సుమారుగా రూ 5,000లోపే ఉండవచ్చునని భావిస్తున్నారు. నోకియా ఈ తక్కవ ఖరీదు కలిగిన లైనక్స్ స్మార్ట్ ఫోన్స్‌పై నోకియా ఎన్నో ఆశలు పెట్టుకొవడం జరిగింది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం పోటీ ఎక్కువగా ఉండడంతో ఇలా తక్కవ రకం లైనక్స్ స్మార్ట్ ఫోన్స్‌ని ప్రవేశపెట్టి కస్టమర్స్ యొక్క చూపులను తనవైపుకి తిప్పుకునే భాగంలో ఈ స్మార్ట్ ఫోన్స్‌ని ప్రవేశపెట్టనున్నామని నోకియా ప్రతినిధులు తెలిపారు.

త్వరలో నోకియా విండోస్ ఆధారిత స్మార్ట్ ఫోన్స్‌ని కూడా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఐతే సోసైటీలో హై ఎండ్ కస్టమర్స్‌ కొసం ప్రత్యేకంగా ఈ హై ఎండ్ విండోస్ ఫోన్స్‌ని విడుదల చేయనున్నామని తెలిపారు. అదే విధంగా ఇండియాలో మద్య తరగతి కుటుంబాల వ్యక్తులు ఎక్కవగా ఉన్నారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకోని ఈ తక్కువ ఖరీదు కలగిన లైనక్స్ ఆపరేటింగ్ స్మార్ట్ ఫోన్స్‌ని వారికోసమని అన్నారు.

నోకియా తక్కవ ధర కలిగిన లైనక్స్ ప్లాట్ ఫామ్ స్మార్ట్ ఫోన్స్ కాన్సెప్ట్ అంతా నోకియా మొబైల్ ఫోన్స్ వైస్ ప్రెసిడెంట్ 'మేరీ మెక్ డువెల్' దేనని తెలిపారు. ఈ తక్కవ ఖరీదు కలిగిన లైనక్స్ స్మార్ట్ ఫోన్స్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టడం వల్ల ఎక్కవ సేల్స్‌ని సాధించడమే కాకుండా, నోకియా ప్రపంచ దేశాలలో తిరిగి తన పూర్వ వైభవాన్ని చాటుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. ప్రస్తుత స్మార్ట్ ఫోన్స్‌కి ఏమేమి ఫీచర్స్ ఐతే ఉన్నాయో అవన్నీ కూడా నోకియా ప్రవేశపెట్టనున్న తక్కవ ఖరీదు కలిగిన లైనక్స్ స్మార్ట్ పోన్స్‌లలో కూడా ఉంటాయని స్పష్టం చేశారు.

నోకియా తక్కవ ఖరీదు లైనక్స్ స్మార్ట్‌ఫోన్ ధర సుమారుగా రూ 5,000 వరకు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X