నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్@రూ.8,500!

Posted By:

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 వేదికగా నోకియా ఆవిష్కరించిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నోకియా ఎక్స్ (Nokia X). నోకియా నుంచి మొట్టమొదటి సారిగా విడుదల కాబోతున్న ఈ డ్యుయల్ సిమ్ ఆండ్రాయిడ్ మొబైలింగ్ డివైస్ పై మార్కెట్ వర్గాల్లో భారీ అంచానాలే ఉన్నాయి.

 నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్@రూ.8,500!

డివైస్ ఇండియన్ మార్కెట్లో అందుబాటుకు సంబంధించి అనేక విషయాలు వెబ్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రూ.8,500 అంచనా ధర పై నోకియా ఎక్స్ మార్చి 15 నుంచి రిటైల్ మార్కెట్లో లభ్యంకానుందని పలు వార్తా వెబ్‌సైట్‌లు కథనాలను ప్రచురించాయి.

ఈ నేపధ్యంలో భారతదేశపు ప్రముఖ మొబైల్ రిటైలర్ ద మొబైల్ స్టోర్ ( The Mobile Store) రూ.8,500 ధర ట్యాగ్‌తో నోకియా ఎక్స్ (డ్యుయల్ సిమ్) డివైస్‌ను తన లిస్టింగ్స్‌లో ఉంచింది. శనివారం (మార్చి 15, 2014) నుంచి ఫోన్ విక్రయాలు ప్రారంభించనున్నట్లు సదరు వెబ్‌సైట్ పేర్కొంది. బ్లాక్, గ్రీన్, సియాన్, ఎల్లో, రెడ్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో నోకియా ఎక్స్ లభ్యంకానుంది.

 నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్@రూ.8,500!

నోకియా ఎక్స్ కీలక స్పెసిఫికేషన్‌లు:

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
3జీ, వై-ఫై, బ్లూటూత్,
జీపీఎస్, ఏ-జీపీఎస్ కనెక్టువిటీ,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot