Home
Mobile

సరికొత్తగా Nokia X, లీకయిన ఫీచర్లు, లాంచింగ్ తేదీ, నోకియా3కి ఓరియో అప్‌డేట్‌

నోకియా సంస్థ హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ చేతుల్లోకి వెళ్లిన తరువాత అనేక ఫోన్లు మార్కెట్లోకి దూసుకొచ్చాయి.

By Hazarath Aiah

నోకియా సంస్థ హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ చేతుల్లోకి వెళ్లిన తరువాత అనేక ఫోన్లు మార్కెట్లోకి దూసుకొచ్చాయి. అత్యంత తక్కువ ధర నుంచి హైఎండ్ స్మార్ట్ ఫోన్ దాకా మార్కెట్లోకి దూసుకొచ్చి యూజర్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నోకియా 3310 అలాగే నోకియా 1 ,ప్రీమియం హ్యాండ్ సెట్ నోకియా 8 సిరొకో లాంటి ఫోన్లతో ఆసియా మార్కెట్లో నోకియా సత్తా చాటుతోంది. ఈ ఊపులోనే నోకియా తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ నోకియా ఎక్స్ ను చైనాలో రిలీజ్ చేసేందుకు సర్వం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ 27న దీనికి కంపెనీ ముహూర్తం పెట్టినట్లుగా తెలుస్తోంది. చైనీస్ బ్లాగ్ ITHome ఈ నెల 27వ తేదీన HMD's upcoming smartphone దూసుకురాబోతుందని రిపోర్ట్ చేసింది. దీనికి ఊతంగా నోకియా ఎక్స్ కి సంబంధించి డిజిటల్ అడ్వర్టయిజ్ మెంట్ కూడా చైనాలో చక్కర్లు కొడుతోంది.

Nokia x

ప్రస్తుతం ఈ ఫోన్‌కు చెందిన పలు స్పెసిఫికేషన్లు, ఇమేజ్‌లు నెట్‌లో లీకయ్యాయి. వాటిని బట్టి చూస్తే.. నోకియా X స్మార్ట్‌ఫోన్‌లో.. 6.3 ఇంచుల భారీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో తదితర ఫీచర్లు ఉండనున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌కు చెందిన పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ తన నోకియా 3 స్మార్ట్‌ఫోన్‌కు గాను ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్న యూజర్లు ప్రస్తుతం తమ డివైస్‌లను ఈ కొత్త ఓఎస్‌కు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ అప్‌డేట్ సైజ్ 875 ఎంబీగా ఉంది. కాగా కొత్త ఓఎస్ అప్‌డేట్‌లో యూజర్లకు పలు ఆకట్టుకునే ఫీచర్లు లభిస్తున్నాయి. పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్, 60 కొత్త ఎమోజీలు, ఆండ్రాయిడ్ ఇన్‌స్టంట్ యాప్స్ తదితర ఫీచర్లను యూజర్లు ఉపయోగించుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Nokia X, a new mid-range phone, could launch on April 27: Report More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X