నోకియా ఎక్స్ అధికారికంగా విడుదల, ధర రూ.8,599

Posted By:

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 వేదికగా నోకియా విడుదల చేసిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నోకియా ఎక్స్ (Nokia X). నోకియా నుంచి మొట్టమొదటి సారిగా విడుదలైన బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను ఇప్పటికే సాహోలిక్.. ఈబే వంటి ఆన్‌లైన్ రిటైలింగ్ వెబ్‌సైట్‌లు వివిధ ధర వేరియంట్‌లలో విక్రయించటం జరుగుతోంది. ఈ క్రమంలో నోకియా ఇండియా నోకియా ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో సోమవారం అధికారికంగా విడుదల చేసింది. ధర రూ.8,599.

నోకియా ఎక్స్ అధికారికంగా విడుదల, ధర రూ.8,599

నోకియా ఎక్స్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్ కనెక్టువిటీ, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ప్రత్యేకమైన ఫీచర్లు:

నోకియా వన్ డ్రైవ్ ద్వారా 10జీబి ఉచిత స్టోరేజ్,
నోకియా మ్యాప్స్, నోకియా మిక్స్ రేడియో,
మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్, మైక్రోసాఫ్ట్ బింగ్, మైక్రోసాఫ్ట్ స్కైప్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot