అంతర్జాతీయ మార్కెట్లోకి నోకియా ఎక్స్2 డ్యూయల్ సిమ్

|

మైక్రోమాక్స్ ఎట్టకేలకు నోకియా ఎక్స్2 డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. గతకొద్ది రోజులుగా ఈ ఫోన్‌కు సంబంధించి అనేక రూమర్లు వెబ్ ప్రపచంలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. నోకియా ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌ను తన అధికారిక వెబ్‌సైట్ లిస్టింగ్స్‌లో ఉంచింది.

 

నోకియా ఎక్స్2 డ్యూయల్ సిమ్ ఫోన్ గ్లోసీ గ్రీన్, ఆరెంజ్, బ్లాక్, గ్లోసీ ఎల్లో, వైట్ ఇంకా మాట్ డార్క్ గ్రే కలర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. ఫోన్ ధర 99 యూరోలు (భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.8090). నోకియా ఎక్స్2 డ్యూయల్ సిమ్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది. నోకియా ఎక్స్2 స్మార్ట్‌ఫోన్‌‍లో నిక్షిప్తం చేసిన కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

అంతర్జాతీయ మార్కెట్లోకి నోకియా ఎక్స్2 డ్యూయల్ సిమ్

స్ర్కాచ్ రెసిస్టెంట్ గ్లాస్ ఫీచ‌ర్‌తో కూడిన 4.3 అంగుళాల క్లియర్ బ్లాక్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్,
అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
నోకియా ఎక్స్ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ 2.0 ( ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం),
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్).
0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ హెచ్ ఎస్ పీఏ+, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్, బ్లూటూత్, జీపీఎస్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ),
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

నోకియా మ్యాప్స్, నోకియా మిక్స్ రేడియో వంటి అప్లికేషన్‌లను ఈ ఫోన్‌లో ముందుగానే ఇన్స్‌స్టాల్ చేసారు. నోకియా స్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని నోకియా కల్పిస్తోంది.

 
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X