నోకియా ఎక్స్2 డ్యూయల్ సిమ్ వచ్చేసింది

Posted By:

మైక్రోసాఫ్ట్‌ జూన్‌లో ప్రకటించిన నోకియా ఎక్స్2 డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో విడుదలైంది. ధర రూ.8,699. నోకియా ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా విడుదలైన నోకియా ఎక్స్2 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ గ్లోసీ గ్రీన్, ఆరెంజ్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. ఆండ్రాయడ్ జెల్లీబీన్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపకల్పన చేయబడిన నోకియా ఎక్స్ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ కెమెరా. 4జీబి ఇంటర్నల్ మెమెరీ వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

 నోకియా ఎక్స్2 డ్యూయల్ సిమ్ వచ్చేసింది

నోకియా ఎక్స్2 డ్యూయల్ సిమ్ ప్రత్యేకతలు...

స్ర్కాచ్ రెసిస్టెంట్ గ్లాస్‌తో కూడిన 4.3 అంగుళాల క్లియర్ బ్లాక్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్, అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆధారంగా రూపకల్పన చేయబడిన నోకియా ఎక్స్ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ పై ఫోన్ రన్ అవుతుంది, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో, ఈ కెమెరా ద్వారా వీడియోలను హైడెఫినిషన్ క్వాలిటీతో రికార్డ్ చేసుకోవచ్చు), 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరార (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందకు), డ్యూయల్ సిమ్ 3జీ వాయిస్ కాలింగ్ సౌకర్యం, కనెక్టువిటీ పీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

చదవండి: ఐఎఫ్ఎ 2014... కొత్త స్మార్ట్‌ఫోన్‌లతో నోకియా కనువిందు

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Nokia X2 Dual SIM Smartphone Launched in India for Rs 8,699. Read more in Telugu Gizbot......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot