ఈ Nokia 5G స్మార్ట్ ఫోన్ పై రూ.12000 ధర తగ్గింది! కొత్త ధర, సేల్ వివరాలు
భారతదేశంలో Nokia X30 5G ధరను కంపెనీ తగ్గించింది. భారత మార్కెట్లో ఈ ఫోన్ లాంచ్ అయి కేవలం 6 నెలల లోనే. కంపెనీ ఈ ఫోన్ ధరను తగ్గించడం గమనించదగిన విషయం. ఈ నోకియా X30 5G ఫోన్ పై ప్రస్తుతం రూ.12,000 ధర తగ్గింపు ఉంది. ఈ ధర తగ్గింపు తర్వాత ఈ ఫోన్ యొక్క కొత్త ధర మరియు ఇతర ఆఫర్ల వివరాల గురించి పూర్తిగా ఇక్కడ తెలుసుకోండి.
ఈ నోకియా X30 5G స్మార్ట్ ఫోన్ 6.43 అంగుళాల పూర్తి-HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 695 5G చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది క్లౌడీ బ్లూ మరియు ఐస్ వైట్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.నోకియా X30 5G స్మార్ట్ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,200mAh బ్యాటరీని కలిగి ఉంది.

భారతదేశంలో నోకియా X30 5G కొత్త ధర, సేల్ వివరాలు
ఈ ధర తగ్గింపు నేరుగా కంపెనీ రాయితీ ద్వారా అందిస్తోంది. నోకియా X30 5G ని దాని ఆన్‌లైన్ స్టోర్ ద్వారా రూ.12,000 తగ్గింపు ధరతో పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ. 48,999 నుండి రూ. 36,999 కి తగ్గింది. ఇది ఒకేఒక 8GB + 256GB RAM మరియు స్టోరేజ్ కాన్ఫిగరేషన్ తో వస్తుంది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ పై నో-కాస్ట్ EMI ఆఫర్ కూడా ఉంది.
నోకియా X30 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో లాంచ్ చేయబడిన, నోకియా X30 5G స్మార్ట్ ఫోన్ 6.43 అంగుళాల పూర్తి-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్ మరియు గరిష్టంగా 700 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. 8GB RAM మరియు 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజీ తో అందుబాటులో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 12 OS తో పనిచేస్తుంది. అలాగే, మూడు సంవత్సరాల వరకు నెలవారీ భద్రతా అప్డేట్ లతో పాటు మూడు ప్రధాన OS అప్‌గ్రేడ్‌లను కంపెనీ వాగ్దానం చేసింది.
కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, OIS మద్దతుతో 50-మెగాపిక్సెల్ ప్యూర్‌వ్యూ ప్రైమరీ సెన్సార్ మరియు 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెకండరీ సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం, ఫోన్ ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా షూటర్‌ను కలిగి ఉంది.
ఈ ఫోన్లో కనెక్టివిటీ ఎంపికలు గమనిస్తే, 5G, Wi-Fi 802.11 a/b/g/n/ac/ax-ready, బ్లూటూత్ 5.1, NFC, GPS/AGPS, GLONASS, Beidou మరియు USB టైప్-C పోర్ట్ లు ఉన్నాయి.
చివరగా, నోకియా X30 5G బ్యాటరీ మరియు ఛార్జింగ్ టెక్నాలజీ వివరాలు చూస్తే, ఇది 4,200mAh బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది మరియు డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ కోసం IP67 రేటింగ్‌ను కలిగి ఉందని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications