స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచంలోకి దూసుకొస్తున్న నోకియా X5

మొబైల్ రంగంలో దూసుకుపోతున్న HMD Global సంస్థ తన లేటెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతుంది. నోకియా X5 పేరుతో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకోరబోతుంది నోకియా.

By Anil
|

స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకోరబోతుంది నోకియా. అయితే చైనా లో ఈ నోకియా X5 ను నోకియా X6 పేరుతో విడుదల చేసారు.కాగా ఈ Nokia X6 స్మార్ట్‌ఫోన్ చైనా స్మార్ట్‌ఫోన్లకు దిమ్మతిరిగే కౌంటర్‌తో సమాధానం ఇచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ చైనాలో జేడీ.కామ్‌, సన్నింగ్‌.కామ్‌, టీమాల్‌.కామ్‌లలో తొలిసారిగా విక్రయానికి వచ్చినప్పుడు 10 సెకన్ల కంటే తక్కువ వ్యవధిలోనే నోకియా X6 స్మార్ట్‌ఫోన్‌ అక్కడ అవుటాఫ్‌ స్టాక్‌ అయింది.ఈ నేపథ్యం లో ఇండియాలో కూడా నోకియా X5 స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తుంది అని నోకియా సంస్థ భావిస్తుంది. అయితే నోకియా సంస్థ అనుకున్న సమయానికి ఫోన్ లాంచ్ చేయలేకపోయింది మొదట జులై 11న మొబైల్ లాంచ్ అవుతున్నట్టు ప్రకటించిన నోకియా కొన్ని కారణాల వల్ల విడుదల చేయలేకేపోయింది. కానీ జులై 17న నోకియా X5 మార్కెట్లోకి రాబోతున్నట్టు కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి.

నోకియా X5  ధర :

నోకియా X5 ధర :

నోకియా X5 ధర పై కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వనప్పటికీ ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 11,000 నుంచి రూ. 13,000 మధ్యలో ఉండవచ్చు అని పుకార్లు వినిపిస్తున్నాయి.

నోకియా X5 లాంచ్ డేట్ :

నోకియా X5 లాంచ్ డేట్ :

అయితే నోకియా సంస్థ నోకియా X5 లాంచ్ డేట్ ను ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.అయితే రష్యా నుండి వచ్చిన తాజా నివేదిక జూలై 17 న తన లేటెస్ట్ నోకియా X సిరీస్ మోడల్ విడుదల చేయబడుతుందని పేర్కొంది.అదే రోజున నోకియా X5 కూడా మార్కెట్ లోకి రావచ్చు అని పుకార్లు వినిపిస్తున్నాయి.

నోకియా X5 డిజైన్:

నోకియా X5 డిజైన్:

బైడు మీద ఉన్న చిత్రాలు, నోకియా X5 రూపకల్పనను హైలైట్ చేసింది. నోకియా X6 డిస్‌ప్లే ఎలా కలిగి ఉందో నోకియా X5 కూడా అలానే ఉండబోతుంది.ఈ స్మార్ట్ ఫోన్లో రెండు కెమెరాల సెట్ అప్ కలిగి ఉంటుంది.వెనుక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంటుంది. గ్లాసిగా కనిపించే బ్లూ కలర్ ప్యానెల్ వెనుక అమర్చబడి ఉంటుంది.

నోకియా X5 పీచర్లు:

నోకియా X5 పీచర్లు:

5.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, మీడియా టెక్ హీలియో ప్రాసెసర్, 2.5డీ గొర్రిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌, 4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్,256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13/5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ , 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

 

Best Mobiles in India

English summary
Nokia X5 Price, Launch Date, Specifications, and More: All You Should Know.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X