నోకియా నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్, రూ.10 వేలకే

హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ నోకియా ఎక్స్‌ సిరీస్ లలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌‌ను విడుదల చేసింది.

|

హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ నోకియా ఎక్స్‌ సిరీస్ లలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌‌ను విడుదల చేసింది. గతంలోనే నోకియా ఎక్స్‌6 ని విడుదల చేయగా ఇప్పుడు కంపెనీ నోకియా ఎక్స్‌5 ను తాజాగా చైనాలో విడుదల చేసింది. హీలియో పీ60 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ లో ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌‌ని అందిస్తున్నారు. 3/4జీబీ ర్యామ్‌ గల ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్లాక్, వైట్‌, బ్లూ వేరియంట్‌లలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

 

రూ. 501కే జియో ఫోన్, ప్రారంభం అయిన బుకింగ్, ఎలాగో తెలుసుకోండిరూ. 501కే జియో ఫోన్, ప్రారంభం అయిన బుకింగ్, ఎలాగో తెలుసుకోండి

నోకియా ఎక్స్‌5 ఫీచర్లు

నోకియా ఎక్స్‌5 ఫీచర్లు

5.86 ఇంచ్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, 720 × 1520 పిక్సల్స్ స్క్రీన్‌ రిజల్యూషన్‌, ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో, హైబ్రిడ్‌ డ్యుయల్‌ సిమ్‌, 13, 5 మెగాపిక్సల్‌ డ్యుయల్‌ బ్యాక్‌ కెమెరాలు, 8 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్‌ బ్యాండ్‌ వైఫై, బ్లూటూత్‌ 4.2, యూఎస్‌బీ టైప్‌ సి, 3060 ఎంఏహెచ్‌ బ్యాటరీ.

ధర

ధర

3జీబీ ర్యామ్‌/ 32జీబీ స్టోరేజ్‌ ఫీచర్లు గల ఫోన్ ధర రూ.10,200 ఉండగా.. 4జీబీ ర్యామ్‌/ 64జీబీ స్టోరేజ్‌ ఫీచర్లు ఉన్న ఫోన్ ధర రూ.14,300 గా నిర్ణయించారు.

 5.86 ఇంచుల భారీ డిస్‌ప్లే
 

5.86 ఇంచుల భారీ డిస్‌ప్లే

ఈ ఫోన్‌లో 5.86 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ను ఇందులో అందిస్తున్నారు. ఇండియాకి ఈ ఫోన్ ఎప్పుడు వస్తుందనేది కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

రెండు కెమెరాలు

రెండు కెమెరాలు

ఫోన్‌ వెనుక భాగంలో 13, 5 మెగాపిక్సల్‌ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను, ముందు భాగంలో 8 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. వీటితో పవర్‌ ఫుల్‌ క్వాలిటీ ఉన్న ఫొటోలు, వీడియోలను తీసుకోవచ్చు. ఫోన్‌ వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు.

వివె వై71

వివె వై71

ఈ ధరకి అటు ఇటుగా వివో కంపెనీ వై71 పేరిట నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రూ.10,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.
వివె వై71 ఫీచర్లు
5.99 ఇంచ్ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3360 ఎంఏహెచ్ బ్యాటరీ.

మోటో ఈ5 ప్లే ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిష‌న్

మోటో ఈ5 ప్లే ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిష‌న్

ఇక మోటోరోలా కూడా తన నూత‌న స్మార్ట్‌ఫోన్ మోటో ఈ5 ప్లే ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిష‌న్ ను తాజాగా విడుద‌ల చేసింది. రూ.9,060 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఈ నెల చివ‌రి నుంచి ల‌భ్యం కానుంది.
మోటో ఈ5 ప్లే ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిష‌న్ ఫీచ‌ర్లు
5.34 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 960 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 425 ప్రాసెసర్‌, 1 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిష‌న్‌, డ్యుయ‌ల్ సిమ్‌, వాట‌ర్ రీపెల్లెంట్ కోటింగ్‌, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్‌), ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2100 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Best Mobiles in India

English summary
Nokia X5 With Display Notch, Dual Rear Cameras Launched: Price, Specifications more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X