మార్కెట్లోకి నోకియా ఎక్స్5, బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ అవుతుందా..?

హెచ్‌ఎండి గ్లోబల్ తన నోకియా ఎక్స్5 (Nokia X5) స్మార్ట్‌ఫోన్‌ను ఎట్టకేలకు చైనా మార్కెట్లో రిలీజ్ చేసింది.

|

హెచ్‌ఎండి గ్లోబల్ తన నోకియా ఎక్స్5 (Nokia X5) స్మార్ట్‌ఫోన్‌ను ఎట్టకేలకు చైనా మార్కెట్లో రిలీజ్ చేసింది. దీంతో నోకియా ఎక్స్ సిరీస్ నుంచి లాంచ్ అయిన రెండవ స్మార్ట్‌ఫోన్‌గా ఈ డివైస్ గుర్తింపు తెచ్చుకుంది.వెర్టికల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, డిస్‌ప్లే నాట్జ్, ప్యూర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం వంటి స్పెషల్ క్వాలిటీ ఫీచర్స్ ఈ ఫోన్‌లో పొందుపరచబడి ఉన్నాయి. ఈ ఫోన్ ధర ఇంకా అందుబాటుకు సంబంధించిన వివరాలను పరిశీలించినట్లయితే..

Nokia X5

రెండు వేరియంట్‌లలో లభ్యం..
నోకియా ఎక్స్ 5 స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ వచ్చేసరికి 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ కెపాసిటీతోనూ, రెండవ వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ కెపాసిటీతోనూ అందుబాటులో ఉంటుంది. చైనా మార్కెట్లో 3జీబి వేరియంట్ ధర CNY 999 (ఇండియన్ కరెన్సీలో షుమారుగా రూ.9,999)గాను, 4జీబి వేరియంట్ ధర CNY 1399 (ఇండియన్ కరెన్సీలో షుమారుగా రూ.13,999)గాను ఉంది. జూలై 19 నుంచి సేల్ ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ Suning.com అనే చైనీస్ వెబ్‌సైట్‌లో ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

భారీ బ్యాటరీతో విడుదలైన Xiaomi Mi Max 3భారీ బ్యాటరీతో విడుదలైన Xiaomi Mi Max 3

నోకియా ఎక్స్ 5 డిజైనింగ్ విషయానికి వస్తే..
డిజైనింగ్ పరంగా చూస్తే నోకియా ఎక్స్ 5 ఫోన్ పాలీకార్బోనేట్ ఫ్రేమ్‌తో కూడిన డబుల్ - సైడెడ్ గ్లాస్ బాడీని కలిగి ఉంది. ఫోన్ ముందు భాగంలో అమర్చిన నాట్జ్ డిస్‌ప్లే ఆధునిక ట్రెండ్‌కు అద్దంపట్టేలా ఉంటుంది. ఫోన్ ముందు వెనుకా భాగాల్లో ప్రింట్ చేసిన నోకియా లోగోలు బ్రాండ్ వాల్యూను సూచించేలా ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన వెర్టికల్ డ్యుయల్ కెమెరా అలానే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వ్యవస్థలు ఓ క్రమ పద్ధతిలో అమర్చబడి ఉన్నాయి. వాల్యుమ్ రాకర్ అలానే పవర్ బటన్‌లను ఫోన్ రైట్ ఎడ్జ్ భాగంలో, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్‌ను ఫోన్ టాప్ ఎడ్జ్ భాగంలో హెచ్‌ఎండి గ్లోబల్ కూర్చింది. నోకియా ఎక్స్ 5 స్మార్ట్‌ఫోన్‌ మొత్తం మూడు (నైట్ బ్లాక్, బాల్టిక్ సీ బ్లూ, గ్లాసియర్ వైట్) కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

నోకియా ఎక్స్ 5 స్పెసిఫికేషన్స్..
5.86 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (720x 1520పిక్సల్స్) విత్ 2.5డి గ్లాస్ ప్రొటెక్షన్ అండ్ 19:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం విత్ మంత్లీ ప్యాచ్ అప్‌డేట్స్, మీడియాటెక్ హీలియో పీ60 ఆక్టా-కోర్ సాక్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ టెక్నాలజీ, 3060mAh బ్యాటరీ, యూఎస్బీ టైప్-సీ కనెక్టువిటీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, బ్లుటూత్ 4.2, జీపీఎస్, ఏ-జీపీఎస్, వై-ఫై, బ్లుటూత్, ఎఫ్ఎమ్ రేడియో, డ్యుయల్ సిమ్ 4జీ వోల్ట్ సపోర్ట్.

Best Mobiles in India

English summary
Nokia X5 has finally been launched by HMD Global in China. The smartphone comes with a dual rear camera setup stacked vertically, a display notch, and runs on pure Android 8.1 Oreo operating system.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X