చైనా ఫోన్లకు నోకియా షాక్, సేల్‌కు వచ్చిన 10 సెకన్లలోపే అవుటాఫ్‌ స్టాక్‌

|

హెచ్‌ఎండీ గ్లోబల్‌ చైనా మార్కెట్లో దుమ్మురేపింది. తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ Nokia X6 స్మార్ట్‌ఫోన్ చైనా స్మార్ట్‌ఫోన్లకు దిమ్మతిరిగే కౌంటర్‌తో సమాధానం ఇచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ చైనాలో జేడీ.కామ్‌, సన్నింగ్‌.కామ్‌, టీమాల్‌.కామ్‌లలో తొలిసారిగా విక్రయానికి వచ్చింది. అయితే సేల్‌కు వచ్చిన 10 సెకన్ల కంటే తక్కువ వ్యవధిలోనే నోకియా ఎక్స్‌6 స్మార్ట్‌ఫోన్‌ అక్కడ అవుటాఫ్‌ స్టాక్‌ అయింది. కాగా ఆకట్టుకునే ఫీచర్లతో 'ఎక్స్' సిరీస్ లోని తన మొదటి స్మార్ట్‌ఫోన్ 'నోకియా ఎక్స్‌6'ను గతవారం చైనా మార్కెట్‌లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫోన్ సంచలనం మీద పూర్తి వివరాలు ఇవే..

 

ఆపిల్ ఐఫోన్ల మీద మనసుపడ్డారా,అయితే ఈ భారీ డిస్కౌంట్లు మీకోసమే..ఆపిల్ ఐఫోన్ల మీద మనసుపడ్డారా,అయితే ఈ భారీ డిస్కౌంట్లు మీకోసమే..

7 లక్షల రిజిస్ట్రేషన్లు..

7 లక్షల రిజిస్ట్రేషన్లు..

ఈ ఫోన్ తొలి సేల్‌ కోసం సుమారు 7 లక్షల రిజిస్ట్రేషన్లు వచ్చినట్టు నోకియాపవర్‌హౌజ్‌ వెల్లడించింది. సెకన్ల వ్యవధిలో అయిపోవడంతో కంపెనీ తన రెండో సేల్‌ మే 30న నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆ సేల్‌ కోసం ప్రస్తుతం కంపెనీ రిజిస్ట్రేషన్లను చేపడుతోంది.

ఏఐతో డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌

ఏఐతో డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌

కాగా ఏఐతో డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌, హెచ్‌డీఆర్‌ ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీంతో పాటు నాచ్ ఫీచర్ కూడా ప్రధాన ఆకర్షణగా కంపెనీ తెలిపింది. ఈ డిస్‌ప్లే పైభాగంలో ఐఫోన్ 10 తరహాలో నాచ్ ఉంటుంది

ధర
 

ధర

చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్‌ 4జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 1,298 సీఎన్‌వై(సుమారు రూ.13,800)గా ఉంది. 4జీబీ ర్యామ్‌, 64జీబీ వేరియంట్‌ ధర 1,499 సీఎన్‌వై(సుమారు రూ.16వేలు) కాగ, 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 1,699 సీఎన్‌వై(సుమారు రూ.18,100)గా కంపెనీ నిర్ణయించింది.

నోకియా ఎక్స్6 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు

నోకియా ఎక్స్6 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు

5.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 2.5డీ గొర్రిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌, 4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్,256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16/5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3060 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ fingerprint sensor.

అంతర్జాతీయ మార్కెట్లో..

అయితే ఈ ఫోన్ ఎప్పుడు ఇండియాకి వస్తుందనే వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. కాగా HMD చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ జుహో ఈ ఫోన్ అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ చేయాలా వద్దా అనే దానిపై పోల్ నిర్వహించారు. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. కాబట్టి ఇది అతి త్వరలోనే ఇతర మార్కెట్లలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Nokia X6 went on sale for the first time after its China launch last week. The Nokia X6 smartphone was made available on JD.com, Suning.com, and Tmall.com, and the stock ran out in less than 10 seconds. Next sale of Nokia X6 is on May 30..more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X