సెకన్లలో అవుట్ ఆఫ్ స్టాక్ అయిన ఆ ఫోన్ ఇండియాకు వస్తోంది

హెచ్ఎండీ గ్లోబల్ బ్రాండ్ నోకియా గత నెలలో చైనాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన నోకియా ఎక్స్‌6 ఇండియాకి త్వరలో వస్తోంది.

|

హెచ్ఎండీ గ్లోబల్ బ్రాండ్ నోకియా గత నెలలో చైనాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన నోకియా ఎక్స్‌6 ఇండియాకి త్వరలో వస్తోంది. ఈ ఫోన్ అక్కడ రిలీజయిన రోజు నుంచి యూజర్లకు చిక్కడం లేదు. అమ్మకాలకు వచ్చిన సెకన్లలోనే అది అవుట్ ఆఫ్ స్టాక్ అంటూ దర్శనమిస్తోంది. కాగా నోకియా నుంచి నాచ్‌ డిస్‌ప్లేతో వచ్చిన తొలి నోకియా ఫోన్‌ కూడా ఇదే కావడం గమనార్హం. సెకన్లలో అవుటాఫ్‌ స్టాక్‌ అవుతున్న ఈ ఫోన్ ఇండియాలో కూడా భారీగా అమ్మకాలను కొల్లగొడుతుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

 

ఇంటర్నెట్ లేకుండానే వెబ్‌ సర్ఫ్ చేయవచ్చు,మీకోసం కొత్త ఫీచర్ఇంటర్నెట్ లేకుండానే వెబ్‌ సర్ఫ్ చేయవచ్చు,మీకోసం కొత్త ఫీచర్

నోకియా ఎక్స్‌6 సపోర్టు పేజీ

నోకియా ఎక్స్‌6 సపోర్టు పేజీ

ఇండియాలో అమ్మాకానికి వస్తుందని ఊతంగా నోకియా ఎక్స్‌6 సపోర్టు పేజీ ప్రస్తుతం కంపెనీ భారత్‌ వెబ్‌సైట్‌లో లైవ్‌గా ఉంది. డివైజ్‌ యూజర్‌ గైడ్‌ను కూడా వెబ్‌సైట్‌లో హోస్ట్‌ చేస్తోంది. దీంతో ఈ ఫోన్‌ కచ్చితంగా భారత్‌లో డీఓటీ రూపొందించిన నిబంధనలను అనుసరిస్తుందని తెలుస్తోంది.

దేశీయ వెబ్‌సైట్‌లో..

దేశీయ వెబ్‌సైట్‌లో..

‘మీ మొబైల్‌ డివైజ్‌ భారత డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ రూపొందించిన రేడియో తరంగాల అవసరాలను అనుకరిస్తూ తయారు చేశాం' అని నోకియా సపోర్ట్‌ పేజీ నోట్స్‌లో పేర్కొంది. దేశీయ వెబ్‌సైట్‌లో ఈ పేజీని లైవ్‌గా ఉంచింది. త్వరలోనే దీనిపై ప్రకటన కూడా చేయబోతుంది.

నోకియా ఎక్స్6 ఫీచర్లు
 

నోకియా ఎక్స్6 ఫీచర్లు

5.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3060 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, ఫాస్ట్ చార్జింగ్.

 ర్యామ్‌, స్టోరేజ్‌

ర్యామ్‌, స్టోరేజ్‌

4జీబీ ర్యామ్‌/32జీబీ స్టోరేజ్‌, 4జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌, 6జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో చైనాలో విడుదల అయింది. బ్లూ, బ్లాక్, సిల్వర్ రంగుల్లో 4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.13,830, రూ.15,980, రూ.18,090 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది.మరి ఇండియాలో దీని ధర ఎంత ఉంటుందనేది ఇంకా సమాచారం లేదు. అదే ధరలో లభించే అవకాశం ఉంది.

 5.8 ఇంచుల భారీ డిస్‌ప్లే

5.8 ఇంచుల భారీ డిస్‌ప్లే

నోకియా ఎక్స్6 స్మార్ట్‌ఫోన్‌లో 5.8 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను అమర్చారు. వెనుక భాగంలో 16, 5 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చారు. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. దీనికి ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కల్పించారు.

 రెండింట్లోనూ ఒకేసారి 4జీ

రెండింట్లోనూ ఒకేసారి 4జీ

నోకియా ఎక్స్6 స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ఈ ఫోన్‌లో డ్యుయల్ వీవోఎల్‌టీఈ సపోర్ట్‌ను అందిస్తున్నారు. దీని వల్ల 4జీ వీవోఎల్‌టీఈ ఫీచర్ ఉన్న రెండు సిమ్‌లను ఒకేసారి వేసుకుని రెండింట్లోనూ ఒకేసారి 4జీ సేవలను పొందవచ్చు.

బ్యాటరీకి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌

బ్యాటరీకి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌

ఈ ఫోన్‌లో అమర్చిన బ్యాటరీకి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల ఈ ఫోన్ సున్నా నుంచి 50 శాతం వరకు చార్జింగ్ అయ్యేందుకు కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.

నోకియా 6 (2018) ఫీచర్లు

నోకియా 6 (2018) ఫీచర్లు

ఈ ఫోన్ నోకియా 6కి సక్సెసర్ గా వచ్చినట్లు తెలుస్తోంది. నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌ 2018 వేరియెంట్‌ను మార్కెట్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే . రూ.14,655 ప్రారంభ ధరకు ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
నోకియా 6 (2018) ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో), హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
Nokia X6 India Launch Confirmed; Support Page Goes Live on the Indian Website More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X