నోకియా ఎక్స్ నుంచి తొలి సిరీస్ స్మార్ట్‌ఫోన్, బడ్జెట్ ధరలో..

|

నోకియా బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్న హెచ్‌ఎండీ గ్లోబల్‌ 'ఎక్స్‌' సిరీస్‌లో తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను ఎట్టకేలకు చైనాలో విడుదల చేసింది. నోకియా ఎక్స్‌6 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. కాగా త్వరలో భారత్‌లోనూ లభ్యం కానుంది. నాచ్‌ డిస్‌ప్లేతో వచ్చిన తొలి నోకియా స్మార్ట్‌ఫోన్‌ ఇదే కావడం విశేషం. నోకియా 6(2018) ధరకు దగ్గరగానే ఈ నోకియా ఎక్స్‌6 ధరను కూడా కంపెనీ నిర్ణయించింది. కేవలం ఈ స్మార్ట్‌ఫోన్‌కు నాచ్‌ డిస్‌ప్లేను అందించడమే కాకుండా... ఆల్‌-గ్లాస్‌ డిజైన్‌ను ఇది అందిస్తోంది.

 

ఆపిల్ నుంచి ఐఫోన్ ఎస్ఈ2 , అచ్చం Iphone X లాగే..ఆపిల్ నుంచి ఐఫోన్ ఎస్ఈ2 , అచ్చం Iphone X లాగే..

నోకియా ఎక్స్6 ఫీచర్లు

నోకియా ఎక్స్6 ఫీచర్లు

5.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3060 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, ఫాస్ట్ చార్జింగ్.

నోకియా ఎక్స్‌6 ధర

నోకియా ఎక్స్‌6 ధర

4జీబీ+32జీబీ వేరియంట్‌ ధర 1299 సీఎన్‌వై(సుమారు రూ.13,800)
4జీబీ+64జీబీ వేరియంట్‌ ధర 1499 సీఎన్‌వై(సుమారు రూ.16,000)
6జీబీ+64జీబీ వేరియంట్‌ ధర 1699 సీఎన్‌వై(సుమారు రూ.18,000)

వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌
 

వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌

నోకియా ఎక్స్6 స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ఈ ఫోన్‌లో డ్యుయల్ వీవోఎల్‌టీఈ సపోర్ట్‌ను అందిస్తున్నారు. దీని వల్ల 4జీ వీవోఎల్‌టీఈ ఫీచర్ ఉన్న రెండు సిమ్‌లను ఒకేసారి వేసుకుని రెండింట్లోనూ ఒకేసారి 4జీ సేవలను పొందవచ్చు.

ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌

ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌

ఈ ఫోన్‌లో అమర్చిన బ్యాటరీకి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల ఈ ఫోన్ సున్నా నుంచి 50 శాతం వరకు చార్జింగ్ అయ్యేందుకు కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. అదనంగా డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌, స్నాప్‌డ్రాగన్‌ 636 చిప్‌సెట్‌ ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Nokia X6 smartphone finally launched in China, price tags start from CNY 1,299 More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X