నోకియా ఎక్స్ 6 Vs హువాయి పీ20 లైట్, ఫీచర్ల పరంగా ఏది బెటర్..?

హెచ్ఎండీ గ్లోబల్ నుంచి వస్తున్న సరికొత్త నోకియా ఎక్స్ 6 ఫోన్ ఇప్పటికే చైనా మార్కెట్లో విడుదలైంది.

|

హెచ్ఎండీ గ్లోబల్ నుంచి వస్తున్న సరికొత్త నోకియా ఎక్స్ 6 ఫోన్ ఇప్పటికే చైనా మార్కెట్లో విడుదలైంది. గతంలో ఫీచర్ ఫోన్ల సామ్రాజ్యంలో రారాజుగా వెలిగిన నోకియా, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లో కూడా తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. అయితే నోకియా ఎక్స్6 కు పోటీగా అటు హువాయి నుంచి పీ20 లైట్ కూడా మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ రెండు మోడల్స్ పోటీ పడేందుకు ఒక కారణముంది. రెండు మోడల్స్ కూడా రూ.20,000లోపు ధరల శ్రేణిలో లభిస్తున్నాయి. మరి అలాంటప్పుడుు రెండు ఫోన్లలో దేనిని ఎంపిక చేసుకోవాలి అనే కన్ ఫ్యూజన్ కలగడం సహజం.

ఏపీ, తెలంగాణా వాసులకు తియ్యని శుభవార్తను అందించిన ఓలాఏపీ, తెలంగాణా వాసులకు తియ్యని శుభవార్తను అందించిన ఓలా

మరి ఇలాంటి సందర్భంలో టెక్ ప్రపంచంలో ఈ రెండు మోడల్స్ పై నిపుణులు సలహాలు తీసుకోవాల్సి ఉంది. హువాయి పీ20 లైట్ ధర రూ.19999 గా నిర్ణయించగా,దీని సామర్థ్యం 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీతో లభిస్తోంది. ఇక ఇదే రేంజ్ లో ఉన్న నోకియా ఎక్స్ 6 ను ధర చైనా మార్కెట్లో 1499 యువాన్లు ( అంటే రూ.15500)గా లభించే అవకాశం ఉంది. అయితే ఇది కూడా 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీతో మార్కెట్లోకి ప్రవేశించనుంది. అయితే భారత్ మార్కెట్లో నోకియా ఎక్స్6 ధర రూ.17,000గా నిర్ణయించే అవకాశం ఉంది. అయితే రెండు ఫోన్ల డిస్ ప్లే కూడా ఒక టాప్ లెవల్ అనే చెప్పవచ్చు.

ఈ సాఫ్ట్‌వేర్‌లతో మీరే సొంతంగా Apps క్రియేట్ చేసుకోవచ్చు..ఈ సాఫ్ట్‌వేర్‌లతో మీరే సొంతంగా Apps క్రియేట్ చేసుకోవచ్చు..

డిజైన్..

డిజైన్..

డిజైన్ విషయంలో రెండు కూడా ఒకే తరహాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రెండు ఫోన్లు గ్లాస్ డిజైన్ కలిగి ఉన్నాయి. అలాగే రేర్ ఫేసింగ్ కెమెరాతోపాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉన్నాయి. రెండు ఫోన్లు డ్యుయర్ రేర్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉన్నాయి. రెండూ కూడా రూ.20వేల లోపే లభించడం విశేషం.

ప్రత్యేకతలు:

ప్రత్యేకతలు:

నోకియా ఎక్స్6 క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 636 ఆక్టా కోర్ చిప్ సెట్ కలిగి ఉంది. అయితే హువాయి పీ20 లైట్ మాత్రం హై సిలికాన్ కిరిన్ 659ఆక్టాకోర్ చిప్ సెట్ ను కలిగి ఉంది. ఆక్టాకోర్ చిప్ సెట్ కావడంతో ఫోన్ సామర్థ్యం పరంగా రెండూ సమానంగా నిలిచాయి. అయితే డిస్‌ప్లే విషయంలో ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ కలిగి ఉంది. తద్వారా మరింత సమర్థవంతంగా గేమ్స్ ఆడుకునే వీలుంది. హ్యూవే పీ20 డిస్‌ప్లే 5.84 ఇంచులుగా ఉంది. నోకియా ఎక్స్6 డిస్‌ప్లేతో పోల్చితే కొద్దిగా పెద్దదే. ఎక్స్6 డిస్‌ప్లే మాత్రం 5.8 ఇంచులుగా ఉంది. ఇక రిజల్యూషన్ కూడా 2280 X 1080 పిక్సెల్స్ గా ఉంది.

కెమెరా..

కెమెరా..

ఇక కెమెరా విషయానికి వస్తే, హువాయి పీ పీ20లైట్ 16 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతోపాటు మరో 2 మెగాపిక్సెల్ సెకండరీ డెప్త్ కెమరాను వాడుతున్నారు. ఇక నోకియా ఎక్స్6 లో మాత్రం 16మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ వాడుతున్నారు. ఇక హువాయి పీ20 లైట్ లో 24 మెగాపిక్సెల్ అతి పెద్ద సెల్ఫీ కెమెరా ను వాడారు. ఇక వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే హువాయి పీ20 లైట్‌తో 1080 పిక్సెల్ క్లారిటీతో వీడియోలు తీసే వీలుంది. అయితే నోకియా ఎక్స్6 తో మాత్రం 4కే వీడియోలు రికార్డు చేసే సామర్థ్యం కలిగి ఉంది.

బ్యాటరీ :

బ్యాటరీ :

నోకియా 6ఎక్స్ లో 3060 ఎంఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ వాడితే, హువాయి పీ 20 లైట్ లో మాత్రం 3000 ఎంఏహెచ్ అయాన్ బ్యాటరీ వాడారు. రెండు ఫోన్లలో కూడా యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ కలిగి ఉంది. అలాగే 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. హెవీ యూజర్లకు ఈ ఫోన్లు విందు భోజనం. ఇక రెండు మోడల్స్ కూడా ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఓఎస్ తో పనిచేస్తున్నాయి.

Best Mobiles in India

English summary
The Nokia X6 and the Huawei P20 Lite are some of the best smartphones under Rs 20,000. These phones have a premium all glass design with a display that embraces an iPhone X style More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X