నోకియా VS షియోమి VS, అసుస్, ఏది బెస్ట్ చూద్దామా !

|

మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ల సందడి ప్రారంభమైంది. ఇప్పుడు తాజాగా హెచ్ఎండీ గ్లోబల్ నుంచి నోకియా ఎక్స్6 చైనాలో విడుదల కాగా దీని డిజైన్ అచ్చు ఐఫోన్ ఎక్స్ ను తలపించడం విశేషం. అయితే నోకియా ఎక్స్6 ఎంట్రీలెవల్ ఫోన్ ధర 1200 యువాన్లు( అంటే రూ.13000) గా ఉంది. అది కూడా 3 జీబీ రామ్, 32 జీబీ స్టోరేజీతో కలిపి చెప్పవచ్చు. సరిగ్గా ఇదే తరహాలో అసుస్ నుంచి కూడా ఒక స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. అసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ప్రో ఎం1 ను భారత్ లో లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.10999గా నిర్ణయించారు. అయితే ఈ రెండు ఫోన్లు కూడా ప్రస్తుతం చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ రెడ్ మీ నోట్ 5 ప్రో కు పోటీ ఇవ్వనున్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ ధర 1000రూ.లు పెంచగా ప్రస్తుతం దీని ధర రూ.14999గా ఉంది. అలాగే దీని ఫీచర్ల విషయానికి వస్తే 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ వరకూ ఉండటం విశేషం.

 

శాంసంగ్ కొత్త ఫోన్ల మాయ,వీడియో చూస్తూ ఛాటింగ్, ఇండియాలోనే తొలిసారి..శాంసంగ్ కొత్త ఫోన్ల మాయ,వీడియో చూస్తూ ఛాటింగ్, ఇండియాలోనే తొలిసారి..

కామన్ అంశం

కామన్ అంశం

ఈ మూడు ఫోన్లలో కామన్ అంశం ఏమిటంటే అన్నింటికి క్వాల్ కామ్ స్మాప్ డ్రాగన్ 636 ఆక్టా కోర్ చిప్ సెట్ ప్రాసెసర్ అనే చెప్పవచ్చు. దీని ద్వారా అత్యంత ఉన్నతమైన పెర్ఫార్మన్స్ కనబరిచే అవకాశం ఉంది. అయితే ఈ మూడింటిలో రెడ్ మీ స్మార్ట్ ఫోన్ అటు ధర పరంగానూ, ఫీచర్ల పరంగానూ షియోమీ వరల్డ్ క్లాస్ డిజైన్ తో ముందుకు వచ్చింది. అదే తరహాలోఅటు అసుస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో ఎం1 , నోకియా ఎక్స్6ఎక్స్ కూడా భిన్నమైన డిజైన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

డిజైన్ :

డిజైన్ :

షియోమీ నోట్ 5 సెమీ మెటల్ యూని బాడీతో పాటు ప్లాస్టిక్ యాంటెనా బ్యాండ్ ను కలిగి ఉంది. అటు అసుస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో ఎం 1 కూడా సుమారు ఇలాంటి క్వాలిటీతో బాడీ కలిగి ఉంది. ఇక నోకియా ఎక్స్6 మాత్రం పూర్తి స్థాయిలో గ్లాస్ డిజైన్ ను కలిగి ఉంది. డిజైన్ పరంగా నోకియా ఎక్స్6 ప్రీమియం అనే చెప్పవచ్చు.

ప్రత్యేకతలు:
 

ప్రత్యేకతలు:

నోకియా ఎక్స్ 6 స్క్రీన్ విషయానికి వస్తే 5.8 ఇంచుల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే కలిగి ఉండగా, రెడ్ మీ నోట్ 5 ప్రో, అసుస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో లో 5.99 ఇంచుల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే కలిగి ఉంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్లలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 636 అక్టా కోర్ చిప్ సెట్ విత్ 3/4/6 జీబీ ర్యామ్ సామర్థ్యం గల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. నోకియా, అసూస్ లో మాత్రం 32/64 జీబీ స్టోరేజీ సామర్థ్యం కలిగి ఉన్నాయి. నోకియా, షియోమీ ఫోన్లలో రెండు సిమ్ స్లాట్లు ఉన్నాయి. అందులో ఒక స్లాట్ లో సిమ్ బదులు మైక్రో ఎస్ డీ లోడ్ చేసుకునేందుకు స్థలం ఉంది. ఇక అసూస్ మూడు స్లాట్లు ఉన్నాయి. రెండు సిమ్ స్లాట్లతో పాటు మైక్రో ఎస్డీ లోడ్ చేసుకోవచ్చు.

కెమెరా ఫీచర్స్ :

కెమెరా ఫీచర్స్ :

అయితే ఈ మూడు ఫోన్లలో కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే డ్యుయల్ కెమెరా సెటప్ తో పాటు ఆర్జీబీ సెన్సర్, సెకండ్ డెప్త్ సెన్సర్ ను కలిగి ఉంది. షియోమీ నోట్ 5 12+5 మెగాపిక్సెల్ సెటప్ కలిగి ఉంటే, నోకియా ఎక్స్ 6 మాత్రం 16+5 మెగా పిక్సెల్ సెటప్ కలిగి ఉంది. అలాగే జెన్ ఫోన్ మాక్స్ ప్రో కూడా 13+5 మెగాపిక్సెల్ కెపాసిటీ కలిగి ఉంది. అలాగే వీటికి ఫేస్ రికగ్నైజేషన్ అన్ లాక్ ఫీచర్ కలిగి ఉండటం విశేషం

సాఫ్ట్ వేర్

సాఫ్ట్ వేర్

ఇక సాఫ్ట్ వేర్ విషయానికి వస్తే నోకియా ఎక్స్6 , అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో ఎం1 లేటెస్ట్ యాండ్రాయిడ్ 8.1 ఓరియో ఓఎస్ ను కలిగి ఉంది. అలాగే షియోమీ రెడ్ మీ నోట్ 5 ప్రో ఆండ్రాయిడ్ నౌగట్ ను ఓఎస్ గా కలిగి ఉంది.

 బ్యాటరీ :

బ్యాటరీ :

ఇక బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో ఎం1  5000 ఎంఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ కలిగి ఉంటే నోకియా ఎక్స్6, రెడ్ మీ నోట్ ప్రో 3060, 4000 ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. మిగితా రెండు ఫోన్లతో పోల్చితే నోకియా ఎక్స్ బ్యాటరీ సామర్థ్యం తక్కువే. అయితే వీటితో పాటు క్విక్ చార్జింగ్ యూఎస్బీ 3.0 సీ టైప్ పోర్ట్ నోకియా ఎక్స్ 6 ప్రత్యేకత.

Best Mobiles in India

English summary
Nokia X6 Vs Xiaomi Redmi Note 5 Pro Vs Asus ZenFoneMax Pro M1 More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X