ఆండ్రాయిడ్ హంగులతో నోకియా ఎక్స్ఎల్ డ్యుయల్ సిమ్!

Written By:

అందరిని ఆశ్చర్యపరుస్తూ.. అంచనాలను తలకిందులు చేస్తూ ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ నోకియా తన ఎక్స్ సిరీస్ నుంచి నోకియా ఎక్స్, నోకియా ఎక్స్+, నోకియా ఎక్స్ఎల్ పేర్లతో ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ పై స్పందించే మూడు స్మార్ట్‌ఫోన్‌లను ఇటీవల అంతర్జాతీయ మార్కెట్‌కు పరిచయం చేసింది.

ఆండ్రాయిడ్ హంగులతో నోకియా ఎక్స్ఎల్ డ్యుయల్ సిమ్!

వాటిలో ఒకటైన ‘నోకియా ఎక్స్ఎల్'(Nokia XL) గురువారం నుంచి ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ప్రముఖ రిటైలర్
స్నాప్‌డీల్ (Snapdeal) ఈ డ్యుయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌‍ను రూ.11,349కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...... 5 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480×800పిక్సల్స్), ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్లే ప్రాసెసర్, 768 ఎంబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్ సౌలభ్యతతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే.. డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (13 గంటల టాక్ టైమ్, 37 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్), ఫోన్ చుట్టుకొలత 141.3 x 77.7 x 10.8మిల్లీ మీటర్లు, బరువు 190 గ్రాములు.


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot