ఎదురులేని షియోమికి పెద్ద షాక్, రేపు ముహూర్తం పెట్టిన నోకియా !

By Hazarath
|

హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఆధ్వర్యంలో నోకియా బ్రాండ్‌ రీ-లాంచ్‌ అయిన తర్వాత కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్‌ ఫోన్లతో దిగ్గజాలకు షాకిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే రేపు షియోమికి నోకియా భారీ షాక్ ఇవ్వనుంది. ఇప్పటి వరకు నోకియా లాంచ్‌ చేసిన అన్ని స్మార్ట్‌ఫోన్ల కంటే చౌకగా.. దేశీయ మార్కెట్‌లోకి మరో కొత్త నోకియా ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను లాంచ్‌ చేయాలని హెచ్‌ఎండీ గ్లోబల్‌ ప్లాన్‌ చేస్తోంది. అందులో భాగంగా నోకియా2ని భారత్‌లో విడుదల చేయాలని చూస్తోంది.

 

సొంత గడ్డపై చైనా ఫోన్లకు దిమ్మతిరిగే షాక్, హాట్ కేకుల్లా నోకియా 7..సొంత గడ్డపై చైనా ఫోన్లకు దిమ్మతిరిగే షాక్, హాట్ కేకుల్లా నోకియా 7..

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో దీన్ని ఉదయం 11.30 నిమిషాలకు..

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో దీన్ని ఉదయం 11.30 నిమిషాలకు..

నోకియా 2 ఫోన్‌ లాంచింగ్‌ షెడ్యూల్‌ అక్టోబర్‌ 31నే ఉంటుందని, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో దీన్ని ఉదయం 11.30 నిమిషాలకు లాంచ్ చేయబోతున్నట్టు అనధికారికంగా రిపోర్టులు వెలువడుతున్నాయి.

రూ.6000గా ఉంటుందని అంచనాలు..

రూ.6000గా ఉంటుందని అంచనాలు..

ఈ లాంచింగ్‌ గురించి కంపెనీ ఎలాంటి విషయాలు రివీల్‌ చేయనప్పటికీ, నోకియా స్మార్ట్‌ఫోన్లలో తాము తర్వాత తీసుకురాబోతున్న డివైజ్‌ మాత్రం ఓ మైలురాయి అని అభివర్ణించింది. దీని ఖరీదు షియోమి బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ మాదిరి రూ.6000గా ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి.

అంటుటు బెంచ్‌మార్కు..
 

అంటుటు బెంచ్‌మార్కు..

చైనా దిగ్గజం అంటుటు బెంచ్‌మార్కు టెస్ట్‌ ఈ డివైజ్‌ వివరాలను లీక్‌ చేసేసింది. అలాగే ఈ ఫోన్ కి సంబంధించిన వివరాలు Winfuture.de అనే సైట్లోనూ ప్రత్యక్షమయ్యాయి. రానున్న ఈ ఫోన్ బ్లాక్, వైట్ వేరియంట్లలో యుఎస్ మార్కెట్లోకి రానుందని సమాచారం. దీనికి సంబంధించిన వివరాలను FCCలో ఇప్పటికే కంపెనీ నమోదు చేసింది.

ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే..

ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే..

క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగనన్‌ 212 చిప్‌సెట్‌
1జీబీ ర్యామ్‌, 8జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌,
5 ఇంచ్ డిస్ ప్లేతో పాటు, entry-level Qualcomm Snapdragon 212 chipset
5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా, 8 మెగాపిక్సెల్‌ ప్రైమరీ కెమెరా
ఆండ్రాయిడ్‌ నోగట్‌ 7.1.1,
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

నోకియా 2తో పాటు నోకియా 7

నోకియా 2తో పాటు నోకియా 7

కాగా నోకియా 2తో పాటు హెచ్‌ఎండీ గ్లోబల్‌ రేపు మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌లో నోకియా 7 కూడా లాంచ్‌ కాబోతుందట. ఈ డివైజ్‌ ఈ నెల మొదట్లోనే చైనాలో లాంచ్‌ అయింది. దీని ధర రూ. సుమారు రూ.25 వేలుగా ఉంది.

నోకియా 7 ఫీచర్ల విషయానికొస్తే..

నోకియా 7 ఫీచర్ల విషయానికొస్తే..

5.2 ఇంచ్ ఐపీఎస్ 2.5డీ డిస్‌ప్లే
1080x1920 పిక్సెల్స్ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్ 7.1.1నౌగట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌
4/6 జిబి ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 128 జీబీ వరకు విస్తరించుకునే సదుపాయం
16 మెగాపిక్సెల్‌ రియర్‌కెమరా 5 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా
ఫింగర్ ప్రింట్ స్కానర్ 3000 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ

నోకియా 7 గత వారమే చైనా మార్కెట్లోకి..

నోకియా 7 గత వారమే చైనా మార్కెట్లోకి..

నోకియా 7 గత వారమే చైనా మార్కెట్లోకి అమ్మకానికి వెళ్లింది. అక్కడ పాపులర్ ఈ కామర్స్ సైట్లు అయిన JD.com, Suningలలో ఈ ఫోన్ల రిజిస్ట్రేషన్ల పక్రియను పెట్టారు. అయితే నిమిషాల వ్యవధిలోనే ఈ పక్రియ పూర్తి అయింది. కేవలం ఒక్క నిమిషంలోనే దాదాపు లక్షా 50 వేల రిజిస్ట్రేషన్లు వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Nokia's cheapest Android phone might launch tomorrow; features, specifications leaked more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X