లాంచింగ్‌కు ముందే వన్‌ప్లస్ 5టీ సంచలనం, ఆఫర్లు ఇవే!

|

ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూ సరికొత్త టెక్నాలజీ అవతరిస్తూనే ఉంది. విప్లవాత్మక ఫీచర్లతో లాంచ్ అవుతోన్న సాంకేతిక ఉత్పత్తులకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో ఇటువంటి ట్రెండ్ ఎక్కువుగా కనిపిస్తోంది. అమెరికా వేదికగా ఇటీవల జరిగిన OnePlus 5T స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఈవెంట్, అటు ప్రపంచదేశాలతో పాటు ఇటు భారత్‌ మార్కెట్ పైనా పెను ప్రభావం చూపింది.

 

వన్‌ప్లస్ 5టీని ప్రమోట్ చేస్తూ సరికొత్త బ్యానర్స్‌...

వన్‌ప్లస్ 5టీని ప్రమోట్ చేస్తూ సరికొత్త బ్యానర్స్‌...

ఈ స్మార్ట్‌ఫోన్ పట్ల భారత్‌లోని ప్రముఖ బ్రాండ్‌లు సైతం తీవ్రమైన ఆసక్తిని కనబరుస్తున్నాయి. క్యాటగిరీతో సంబంధం లేకుండా వివిధ రంగాలకు చెందిన బ్రాండ్‌లు వన్‌ప్లస్ 5టీ ప్రమోట్ చేస్తూ సరికొత్త బ్యానర్స్‌ను సోషల్ మీడియా ఛానల్స్‌లో పోస్ట్ చేయటం చర్చనీయాశంగా మరింది. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ మారిన వన్‌ప్లస్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌కు ఇంతలా క్రేజ్ లభించటాన్ని ఓ సంచలనంగా మార్కెట్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

Zomato 12 నెలల ఉచిత సర్వీస్..

Zomato 12 నెలల ఉచిత సర్వీస్..

వన్‌ప్లస్ 5టీ ఇండియా లాంచ్‌ను పరుస్కరించుకుని ప్రముఖ ఆన్‌లైన్ రెస్టారెంట్ గైడ్ Zomato ఓ ప్రత్యేకమైన పోస్టును తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ఆ తరువాత విడుదల చేసిన మరో ప్రకటనలో భాగంగా వన్‌ప్లస్ 5టీని కొనుగోలు చేసే యూజర్లకు సంవత్సరం పాటు Zomato గోల్డ్ సర్వీస్ ఉచితంగా లభిస్తుందని సంస్థ తెలిపింది. ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన జొమాటా గోల్డ్ సర్వీస్ ద్వారా యూజర్లు నచ్చిన ఫుడ్ జాయింట్ల నుంచి భారీ రాయితీలను పొందే వీలుంటుంది.

 సోషల్ మీడియాలో బ్రహ్మరథం..
 

సోషల్ మీడియాలో బ్రహ్మరథం..

వన్‌ప్లస్ 5టీ విడుదల సందర్భాన్ని పురస్కరించుకని జొమాటోతో పాటు జవాంగ్, సావ్న్, జూమ్‌కార్ వంటి ఈ-కామర్స్ బ్రాండ్‌లు ప్రత్యేకమైన బ్యానర్లను క్రియేట్ చేసి తమతమ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా పోస్ట్ చేసాయి. ఈ పోస్టులకు పెద్ద ఎత్తున స్పందన లభించటం విశేషం. హెల్త్‌కేర్ విభాగంలో అత్యుత్తమ ఆన్‌లైన్ సేవలను అందిస్తోన్న హెల్త్‌కార్ట్ సంస్త తనదైన శైలిలో వన్‌ప్లస్ 5టీకి స్వాగతం పలికింది.

 వన్‌ప్లస్ 5టీని ప్రమోట్ చేసిన హెల్త్‌కార్ట్, పీవీఆర్...

వన్‌ప్లస్ 5టీని ప్రమోట్ చేసిన హెల్త్‌కార్ట్, పీవీఆర్...

వన్‌ప్లస్ 5టీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకు సంబంధించిన ప్రత్యేకతలను విశ్లేషిస్తూ ఓ సోషల్ మీడియా పోస్టును తన సోషల్ మీడియా పేజీలో హెల్త్‌కార్ట్ పోస్ట్ చేసింది. మరోవైపు పీవీఆర్, వన్‌ప్లస్ 5టీ లాంచ్ ఈవెంట్‌ను ప్రత్యేక్ష ప్రసారం ద్వారా వీక్షించే అవకాశాన్ని కల్పించింది. వన్‌ప్లస్ 5టీ లాంచ్ ఈవెంట్‌ను వన్‌ప్లస్ ఇండియా ఫ్యాన్స్ పీవీఆర్ థియేటర్స్ ద్వారా వీక్షించారు. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ ఇంకా పూణే నగరాల్లోని ఎంపిక చేసిన పీవీఆర్ సినిమా థియేటర్స్‌లో ఈ లాంచ్ ఈవెంట్‌ను వన్‌ప్లస్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.

షియోమి నుంచి మేడ్ ఇన్ ఇండియా పవర్ బ్యాంక్‌లుషియోమి నుంచి మేడ్ ఇన్ ఇండియా పవర్ బ్యాంక్‌లు

 12 నెలల యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్..

12 నెలల యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్..

భారతదేశపు అతిపెద్ద డివైస్ మేనేజ్‌మెంట్ కంపెనీలో ఒకటైన ‘సర్విఫై' (Servify) వన్‌ప్లస్ 5టీ పై ఆసక్తికర ఆఫర్‌ను అనౌన్స్ చేసింది. వన్‌ప్లస్ 5టీ కొనుగోలుదారులకు కాంప్లిమెంటరీ గిఫ్ట్ క్రింద 12 నెలల యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇన్స్యూరెన్స్ అందుబాటులో ఉంటుందని సర్విఫై తెలిపింది.

భారీ డేటా బెనిఫిట్స్...

భారీ డేటా బెనిఫిట్స్...

వన్‌ప్లస్ 5టీ కొనుగోలు పై ప్రముఖ టెలికం ప్రొవైడర్ ఐడియా సెల్యులార్ సంచలన ఆఫర్‌ను అనౌన్స్ చేసింది. ఈ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా వన్‌ప్లస్ 5టీ కస్టమర్లు 1008జీబి 4జీ డేటాను పొందగలుగుతారు. ఈ డేటాను ఏ విధంగానైనా ఉపయోగించుకునే వీలుంటుంది.

ప్రముఖ బ్యాంకుల నుంచి భారీ డిస్కౌంట్లు...

ప్రముఖ బ్యాంకుల నుంచి భారీ డిస్కౌంట్లు...

వన్‌ప్లస్ 5టీ కొనుగోలు పై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఓ ఇన్‌స్టెంట్ డిస్కౌంట్ ఆఫర్‌ను అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్ క్రింద హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే యూజర్లకు తక్షణ డిస్కౌంట్ క్రింద రూ.1500 వరకు లభిస్తుంది. డిసెంబర్ 2, 2017 వరకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఆఫర్‌ను అమెజాన్.ఇన్, వన్‌ప్లస్‌స్టోర్.ఇన్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్ ద్వారా సద్వినియోగం చేసుకోవచ్చు.

వన్‌ప్లస్ 5టీ పై అమెజాన్ ఆఫర్ల వర్షం..

వన్‌ప్లస్ 5టీ పై అమెజాన్ ఆఫర్ల వర్షం..

వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేసే అమెజాన్ ప్రైమ్ అలానే కైండిల్ యూజర్ల కోసం పలు ఆసక్తికర ఆఫర్లు సిద్ధంగా ఉన్నాయి. 6 అంగుళాల సూపర్ అమోల్డ్ స్ర్కీన్‌తో వస్తోన్న 5టీ, ఈ-బుక్ రీడింగ్‌తో పాటు వీడియో వ్యూవింగ్‌కు మరింత అనువుగా ఉంటుంది. భారత్‌లో ఈ డివైస్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

64జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999. 128జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999. ఈ ఫోన్‌లకు సంబంధించిన ఎర్లీ యాక్సెస్ సేల్ నవంబర్ 21న అమెజాన్ వేదికంగా జరిగింది. ఓపెన్ సేల్ నవంబర్ 28 నుంచి ప్రారంభమవుతంది.

Best Mobiles in India

English summary
OnePlus 5T is powered by a Snapdragon 835 CPU and comes in 6GB and 8GB RAM variants

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X