Home
Mobile

నథింగ్‌ ఫోన్‌ 3 పై భారీ డిస్కౌంట్‌.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌ డీల్స్‌ విడుదల.. పూర్తి వివరాలు..!

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్ డేస్‌ 2025 సేల్‌ (Flipkart Big Billion Days 2025 Sale) సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌, ప్లస్‌ మెంబర్లు 24 గంటల ముందే సేల్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా యాక్సెస్‌, ICICI బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. అయితే ఫ్లిప్‌కార్‌ సేలో నథింగ్‌ బ్రాండ్‌ ఉత్పత్తుల డిస్కౌంట్‌ల వివరాలు వెల్లడయ్యాయి.

నథింగ్‌ ఫోన్‌లతోపాటు CMF ఫోన్‌లు, ఉత్పత్తులను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. అయితే ఇటీవలే నథింగ్‌ నుంచి ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌గా వచ్చిన నథింగ్‌ ఫోన్‌ 3 భారీ తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుందని తెలిపింది. దీంతోపాటు నథింగ్‌ ఫోన్ 1, నథింగ్‌ ఫోన్‌ 2 లను కూడా డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Flipkart Big Billion days 2025

నథింగ్ ఫోన్‌ 3 స్మార్ట్‌ఫోన్ :
నథింగ్ ఫోన్‌ 3 భారత్‌ మార్కెట్‌లో రూ.79999 కి విడుదల అయింది. త్వరలో ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్‌ డేస్‌ 2025 సేల్‌లో భాగంగా 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.59999 కే కొనుగోలు చేయవచ్చని చెబుతోంది.

రూ.34999 కే సొంతం చేసుకోవచ్చు :
అదే 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.69999 కే కొనుగోలు చేయవచ్చని చెబుతోంది. అయితే ఎక్స్ఛేంజీ ఆఫర్లతో రూ.34999 కే కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. నథింగ్‌ నుంచి తొలి ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌గా ఫోన్‌ 3 హ్యాండ్‌సెట్‌ అందుబాటులోకి వచ్చింది.

నథింగ్ ఫోన్‌ డీల్స్‌ :
ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా నథింగ్‌ ఫోన్ 3a స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ రూ.20999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీని రూ.22999 కే అందుబాటులోకి వస్తుందని తెలిపింది. అదే నథింగ్‌ ఫోన్ 3a ప్రో మోడల్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీని రూ.24999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.26999 కే అందుబాటులోకి వస్తుంది.

అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.28999 కే లభిస్తుందని తెలిపింది. దీంతోపాటు CMF ఫోన్‌ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16999 కే కొనుగోలు చేయవచ్చు.

CMF డీల్స్‌ :
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా బ్యాంకు ఆఫర్లతో CMF బడ్స్‌ 2 రూ.2299, బడ్స్‌ 2 ప్లస్‌ రూ.2599, CMF బడ్స్‌ 2a రూ.1699, CMF బడ్స్‌ ప్రో రూ.2499 కే అందుబాటులోకి రానున్నాయి. అదే నథింగ్‌ ఇయర్‌ (a) రూ.4499, నథింగ్‌ ఇయర్ రూ.7499 కే అందుబాటులోకి రానున్నాయి. నథింగ్‌ ఇయర్ (ఓపెన్‌) ను రూ.9999 కే కొనుగోలు చేయవచ్చు.

ప్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్‌ డేస్‌ 2025 సేల్‌లో భాగంగా CMF వాచ్‌లు, నథింగ్‌ ఛార్జర్లు, కేబుళ్లు సహా ఇతర ఉత్పత్తులను బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ ధరకే అందుబాటులోకి రానున్నాయి. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Best Mobiles in India

English summary
Nothing and CMF deals revealed for Flipkart Big Billion days 2025 sale full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X