ఐఫోన్ తరహా యాక్షన్ బటన్‌తో నథింగ్ ఫోన్ 3... ఫోటోలను షేర్ చేసిన సంస్థ సీఈవో..??
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ నథింగ్ సంస్థ నుంచి ఇటీవలే నథింగ్ ఫోన్ 2a విడుదల అయింది. అయితే నథింగ్ సంస్థ ఫోన్ 3 పైన (Nothing Phone 3) పనిచేస్తోందని ఇప్పటికే అనేక లీక్‌లు వస్తున్నాయి. తాజాగా నథింగ్ సంస్థ సీఈవో Carl Pei తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
ఈ ఫోటోల ఆధారంగా నథింగ్ ఫోన్ 3 హ్యాండ్‌సెట్... యాక్షన్ బటన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ యాక్షన్ బటన్ ఐఫోన్ మరియు రియల్‌మి డైనమిక్ బటన్ తరహాలో ఉంది. అయితే నథింగ్ సంస్థ సీఈవో షేర్ చేసిన ఫోటోలను ఫోన్ 3 కి సంబంధించినవిగా భావిస్తున్నా.. సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

కొన్ని నివేదికల ఆధారంగా జులై చివరి నాటికి నథింగ్ ఫోన్ 3 లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. క్విక్ సెట్టింగ్స్ డార్క్ మరియు లైట్ మోడ్ ఫోటోలను CEO షేర్ చేశారు. దీని ఆధారంగా నథింగ్ ఫోన్ 3 హ్యాండ్‌సెట్ కుడి వైపున పవర్ బటన్ మరియు ఎడమ వైపున వాల్యుమ్ బటన్లను గుర్తించవచ్చు. ఫోన్ 2 మరియు ఫోన్ 2(a) తరహాలోనే ఉంది.
అయితే పవర్, వాల్యూమ్ బటన్లతోపాటు మరో బటన్ కూడా ఉంది. అయితే దీన్ని యాక్షన్ బటన్ గా భావిస్తున్నారు. ఐఫోన్ 15లో ఈ తరహా యాక్షన్ బటన్‌ను కలిగి ఉంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ బటన్‌లను shortcut లుగా కూడా ఉపయోగించుకోవచ్చు.

** నథింగ్ సబ్ బ్రాండ్ CMF నుంచి త్వరలో తొలి స్మార్ట్‌ఫోన్ (CMF Phone 1) విడుదల కానుంది. CMF ఫోన్ (1) 6.67 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 120Hz రీఫ్రెష్ రేట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ CMF స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఈ CMF తొలి స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 8GB LPDDR4X ర్యామ్ మరియు 256GB స్టోరేజీ కలిగి ఉంటుంది. అయితే మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ OS 2.6 పైన పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు మూడు సంవత్సరాలపాటు OS అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందవచ్చు. డిజైన్ పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక కవర్ ప్లాస్టిక్‌తో (Replaceable Plastic) తయారుచేయబడుతుంది. మరియు వెనుక గ్లిఫ్ లైట్‌లను కలిగి ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.
కెమెరా విభాగం విషయానికి వస్తే ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. అందులో 50MP ప్రైమరీ కెమెరా సహా మరో కెమెరాతో లాంచ్ కానుందని తెలుస్తోంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 16MP కెమెరాతో రానుంది. ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్, బ్లూ, ఆరెంజ్ రంగుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








