స్మార్ట్‌ఫోన్ పేరు చెప్పకుండా లాంచ్ ఈవెంట్ తేదీని ప్రకటించిన నథింగ్.. రెండు వేరియంట్స్‌లో..?
నథింగ్ ఫోన్ అంటే వాటి ప్రత్యేకమైన డిజైన్ గుర్తుకువస్తుంది. ఇప్పటికే భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న నథింగ్ హ్యాండ్‌సెట్‌లు (Nothing New Smartphones) డిజైన్, ఫీచర్‌లతో యూజర్‌లను ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా సంస్థ నుంచి కీలక ప్రకటన విడుదల అయింది. మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో కార్ల్ పై ధ్రువీకరించారు. లాంచ్ ఈవెంట్ తేదీని వెల్లడించారు. అయితే ఏ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నారో వెల్లడించలేదు. అయితే రెండు వేరియంట్స్‌లో లాంచ్ కానుందని తెలుస్తోంది.
నథింగ్ నుంచి మార్చి 4 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు (Nothing Launch Event in March 2025) కొత్త ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు సంస్థ అధికారిక ప్రకటన చేసింది. అయితే స్మార్ట్‌ఫోన్ వివరాలను వెల్లడించకపోయినా.. నథింగ్ ఫోన్ 3 లేదా 3a గా భావిస్తున్నారు. అయితే బేస్, ప్రో వేరియంట్స్‌లో భారత్ మార్కెట్‌లో విడుదల కానుందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం లీక్ అయిన వివరాల ఆధారంగా నథింగ్ ఫోన్ 3a సిరీస్‌గా భావిస్తున్నారు. సాధారణంగా ఈ సిరీస్‌లు మిడ్ రేంజ్ ధరలో అందుబాటులోకి వస్తాయి. అదే ఫ్లాగ్ షిప్ మోడళ్లు ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. అయితే సంస్థ మాత్రం స్మార్ట్‌ఫోన్ వివరాలు తెలిసేలా ఎటువంటి ప్రకటన చేయలేదు.
అయితే కొన్ని లీక్స్ ఆధారంగా నథింగ్ కొత్త హ్యాండ్‌సెట్ బేస్ వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 లేదా మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే ప్రో వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.
Power in Perspective. 4 March 10:00 GMT. pic.twitter.com/D10WiYwov0
— Nothing (@nothing) January 27, 2025
బేస్ వేరియంట్ 6.5 అంగుళాల డిస్‌ప్లే, ప్రో మోడల్ 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. అయితే ఈ రెండు మోడళ్లు యాక్షన్ బటన్‌లను అమర్చి ఉంటాయని తెలుస్తోంది. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంటాయని సమాచారం.
దీంతోపాటు నథింగ్ ఫోన్ 3 ధరలపై కచ్చితమైన వివరాలు అందుబాటులో లేనప్పటికీ.. బేస్ వేరియంట్ ధర సుమారుగా రూ.45,000 గా ఉంటుందని సమాచారం. అదే ప్రో వేరియంట్ ధర మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. పైన తెలిపిన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, ధరపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. త్వరలో కచ్చితమైన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
* ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు.
నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 5 రక్షణ పొందుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 14 నథింగ్ OS 2.6 తో పనిచేస్తోంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుంది.
ఈ హ్యాండ్‌సెట్ 50MP ప్రైమరీ, 50MP అల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టును కలిగి ఉంది. దీంతోపాటు 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications








