రిల‌య‌న్స్ డిజిట‌ల్ వేదిక‌గా Nothing Phone (1) ఆఫ్‌లైన్ సేల్స్‌!

|

Nothing Phone (1) మొబైల్స్ జులై 12 వ తేదీన మార్కెట్లోకి రానున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆ ఫోన్ ఆఫ్‌లైన్ విడుద‌ల మ‌రియు స్పెసిఫికేష‌న్స్‌కు సంబంధించి మ‌రిన్ని విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. భార‌త్‌లో Nothing Phone (1) మొబైల్స్ సేల్స్ ఫ్లిప్‌కార్ట్ వేదిక‌గా ప్రారంభించ‌నున్న‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది. అదేవిధంగా మొబైల్స్ ఆఫ్‌లైన్ సేల్స్‌కు సంబంధించి కంపెనీ రిల‌య‌న్స్ డిజిట‌ల్ (Reliance Digital) తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు 91మొబైల్స్ నివేదిక పేర్కొంది. ఇప్ప‌టికే ఈ మొబైల్ కొనుగోలుకు ఆస‌క్తి ఉన్న యూజ‌ర్ల కోసం కంపెనీ ఇటీవ‌ల ప్రీ ఆర్డ‌ర్ పాస్‌ల‌ను కూడా జారీ చేసిన‌ట్లు స‌మాచారం.

 
రిల‌య‌న్స్ డిజిట‌ల్ వేదిక‌గా Nothing Phone (1) ఆఫ్‌లైన్ సేల్స్‌!

Nothing Phone (1) స్పెసిఫికేష‌న్లు:
టిప్‌స్టర్ ప్రకారం ఈ హ్యాండ్‌సెట్ మోడల్ నంబర్ A063తో రానున్నది. ఈ మొబైల్స్‌ను ఐ ఫోన్ 12 , 13 తరహా డిజైన్ తో వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. కాగా దీనికి 6.55 అంగుళాల‌ ఫ్లాష్ పానెల్ OLED డిస్‌ప్లే ని అందిస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో ప‌నిచేస్తుంది. ఈ హ్యండ్ సెట్ Qualcomm SM7325-AE Snapdragon 778G+ ప్రాసెసర్ ని క‌లిగి ఉంది. అంతే కాకుండా ఈ మొబైల్ కి 8జీబీ రామ్, మరియు 128 / 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కల్పిస్తున్నారు. ఇక బాటరీ విషయానికి వస్తే 4500 mAh వరకు ఉండొచ్చని సమాచారం. దీని ఫీచర్లని బట్టి చూస్తే ఈ మొబైల్ ధర మార్కెట్ లో దాదాపు రూ. 25 వేల‌ నుంచి రూ. 28 వేల వ‌ర‌కు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

రిల‌య‌న్స్ డిజిట‌ల్ వేదిక‌గా Nothing Phone (1) ఆఫ్‌లైన్ సేల్స్‌!

డ్యుయ‌ల్ కెమెరాతో:
బ్లాక్ మరియు వైట్ కలర్స్ లో ఇది అందుబాటులోకి రానుంది. ఈ మొబైల్‌కు వెన‌క వైపు రెండు కెమెరాల‌ను అందిస్తున్నారు. 50 మెగా పిక్సెల్ క్వాలిటీతో వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగా పిక్సెల్ క్వాలిటీతో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాల్ని క‌లిగి ఉంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ కెమెరా క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారంగా ప‌ని చేస్తుంది. ఈ మొబైల్‌లో 900 ఎల్ఈడీ అమ‌ర్చిన 5 లైటెనింగ్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు. దీంతో అద్భుతమైన లైటింగ్ అనుభూతిని క‌లిగిస్తుంది. లైట్స్ ఓన్లీ నోటిఫికేష‌న్స్ అనే ఫీచ‌ర్ కూడా ఈ మొబైల్‌కు అందిస్తున్నారు. ఇది డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో పాటుగా 45W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్‌ మద్దతుతో రానున్నట్లు తెలిపారు. అదనంగా ఇది NFCని కూడా కలిగి ఉండవచ్చు.

రిల‌య‌న్స్ డిజిట‌ల్ వేదిక‌గా Nothing Phone (1) ఆఫ్‌లైన్ సేల్స్‌!

BIS ఆమోదం:
ఇప్ప‌టి వ‌ర‌కైతే ఈ నథింగ్ ఫోన్ 1 మొబైల్స్ జులై 12 నుంచి ఫ్లిప్ కార్ట్ వేదికగా భారత్ మార్కెట్లో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ ప్ర‌క‌టించింది. కానీ, తాజాగా ఆఫ్‌లైన్ సేల్స్ విష‌యంలోనూ అప్‌డేట్ వ‌చ్చింది. ఆఫ్‌లైన్ సేల్స్ విష‌యంలో కంపెనీ రిల‌య‌న్స్ డిజిట‌ల్ (Reliance Digital) తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం.ఈ మొబైల్స్ భారత్ లో విడుదల దృష్ట్యా కస్టమర్ సపోర్ట్ ను మెరుగు పరిచేందుకు సంస్థ కృషి చేస్తున్న‌ట్లు ఆ సంస్థ భార‌త ప్ర‌తినిధి మ‌ను శ‌ర్మ ఇప్ప‌టికే వెల్ల‌డించారు. మొత్తం 250 నగరాల్లో 270 సర్వీస్ సెంటర్స్ ను ప్రారంభించనుందని ఆయ‌న ఇటీవ‌ల చెప్పారు. అయితే ఈ మొబైల్స్‌ను జులై 12వ తేదీన రిటర్న్ ఇన్స్టింక్ట్ పేరుతో జరగబోయే ఈవెంట్ లో ఈ మొబైల్స్ ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ ఇప్ప‌టికే బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ BIS ద్వారా లిస్టింగ్ అయిన‌ట్లు గ‌తంలో కంపెనీ తెలిపింది. అయితే ఈ మొబైల్‌ను భార‌త్‌లోనే త‌యారు చేస్తున్న‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు వార్త సంస్థ‌లు పేర్కొన్న విష‌యం తెలిసిందే.

Best Mobiles in India

English summary
Nothing Phone (1) Offline Sales In India; In Talks With Reliance Digital

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X