Just In
- 8 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 10 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 13 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 15 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
OnePlus Nord 2T Vs Nothing Phone 1 రెండిటిలో ఏది బెస్టో చూసుకొండిలా!
ఇటీవల మొబైల్ తయారీ కంపెనీలు వినియోగదారుల ఆసక్తికి అనుగుణంగా మిడ్ రేంజ్ ధరల్లో ఫ్లాగ్‌షిప్ అనుభవాన్ని కలిగిన ఫీచర్లను అందిస్తున్నాయి. అందులోభాగంగా Nothing కంపెనీ నుంచి ఇటీవల Nothing Phone 1 విడుదల కాగా.. OnePlus కంపెనీ నుంచి OnePlus Nord 2T విడుదలైంది. ఈ రెండు 5G స్మార్ట్‌ఫోన్లు కూడా మిడ్ రేంజ్ లోనే ఉన్నాయి. కాగా, ఇప్పుడు మనం ఈ రెండు మొబైల్స్‌లో ఏ ఫోన్ ఫీచర్లు బాగున్నాయ్.. ఏది మెరుగైన పని తీరు కనబరుస్తుంది అనే విషయాల్ని తెలుసుకుందాం. ప్రస్తుతం మొబైల్ కొనాలనుకునే వారికి ఈ రెండింటిలో దేనిపై ఆసక్తి ఉందో తెలియజేసేలా వాటి స్పెసిఫికేషన్లను గురించి చర్చించుకుందాం.

Nothing Phone 1 vs OnePlus Nord 2T:
డిస్‌ప్లే, ప్రాసెసర్, ర్యామ్ కెపాసిటీ:
* Nothing Phone 1 స్మార్ట్‌ఫోన్ 6.55 అంగుళాల ఫ్లాష్ పానెల్ OLED డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో పనిచేస్తుంది. ఈ హ్యండ్ సెట్ Qualcomm SM7325-AE Snapdragon 778G+ ప్రాసెసర్ ని కలిగి ఉంది. అంతే కాకుండా ఈ మొబైల్ 12జీబీ ర్యామ్, మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది
* OnePlus Nord 2T స్మార్ట్‌ఫోన్ 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+AMOLED డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేటుతో పనిచేస్తుంది. ఈ హ్యండ్ సెట్ MediaTek Dimensity 1300 SoC ప్రాసెసర్ ని కలిగి ఉంది. అంతే కాకుండా ఈ మొబైల్ 12జీబీ ర్యామ్, మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది.
* ఈ రెండు మొబైల్స్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉన్నాయి. OnePlus Nord 2T మొబైల్ డిస్‌ప్లే ఎడ్జ్‌లో కొంత బెండ్ అయి ఉంటుంది.
చిప్‌సెట్ పర్ఫార్మెన్స్:
* ఇక చిప్‌సెట్ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే నానో టెస్ట్ రివ్యూ ప్రకారం.. వన్‌ప్లస్ మొబైల్ యొక్క MediaTek Dimensity 1300 చిప్‌సెట్ 100 కు గాను 75 స్కోరు సాధించగా.. నథింగ్ ఫోన్ యొక్క Snapdragon 778G చిప్‌సెట్ 62 స్కోరు సాధించినట్లు సమాచారం.

బ్యాటరీ:
* బ్యాటరీల విషయానికొస్తే.. Nothing Phone 1 మొబైల్ 4500 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా 33W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ మద్దతు కలిగి ఉంది. OnePlus Nord 2T స్మార్ట్‌ఫోన్ 4500 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా 80W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ మద్దతు కలిగి ఉంది.
కెమెరాలు:
* Nothing Phone 1 ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో రెండు 50-మెగాపిక్సెల్ సెన్సార్‌లతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో మొదటిది 50-మెగాపిక్సెల్ Sony IMX766 సెన్సార్ ƒ/1.88 అపెర్చర్ లెన్స్‌తో జత చేయబడి ఉండి OIS అలాగే EIS ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వస్తుంది. రెండవది ƒ/2.2 ఎపర్చరుతో 50-మెగాపిక్సెల్ సెన్సార్ Samsung JN1 మరియు అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో జత చేయబడి ఉంటుంది. ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ƒ/2.45 ఎపర్చరు లెన్స్‌తో 16-మెగాపిక్సెల్ సోనీ IMX471 సెన్సార్ ఉంది.
* OnePlus Nord 2T ఇది OIS సపోర్ట్‌తో 50MP Sony IMX766 ప్రైమరీ సెన్సార్‌తో వస్తుంది మరియు ప్రీమియం OnePlus 10R 5G ఫోన్ లాగా ఉంటుంది. ఇందులో 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 2MP మోనో సెన్సార్ కూడా ఉన్నాయి. Nord 2T నైట్‌స్కేప్ మోడ్‌కు మద్దతు ఇస్తుంది మరియు సోనీ యొక్క DOL-HDR ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీని అందిస్తుంది. మీరు చాలా అద్భుతమైన సెల్ఫీలు తీసుకోవడానికి EIS మద్దతుతో 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కూడా పొందుతారు.

ధరలు:
* Nothing Phone 1 వేరియంట్ల ఆధారంగా మూడు ధరల్లో లభిస్తోంది. 8GB+128GB వేరియంట్ ధర రూ.31,999, ఇక రెండో వేరియంటల్ 8GB+256GB ధర రూ.34,999, మూడో వేరియంట్ 12GB+256GB ధర రూ.37,999 గా ఉంది.
* OnePlus Nord 2T వేరియంట్ల ఆధారంగా రెండు ధరల్లో లభిస్తోంది. 8GB+128GB వేరియంట్ ధర రూ.28,999, రెండో వేరియంట్ 12GB+256GB ధర రూ.33,999 గా ఉంది.
5G బ్యాండ్ సపోర్టు:
* ఈ రెండు మొబైల్స్ కూడా 5G సపోర్ట్ కలిగి ఉన్నాయి. Nothing Phone 1 - n1 / n3 / n5 / n7 / n8 / n20 / n28 / n38 / n40 /n41 / n77 / n78-- 5G NR బ్యాండ్‌ల సపోర్టు కలిగి ఉంది. ఇది డ్యూయల్-మోడ్ 5G (NSA మరియు SA)కి సపోర్టు ఇస్తుంది.
* OnePlus Nord 2T - SA: 1/3/5/8/28/40/41/78; 5G NSA: 40/41/78 బ్యాండ్‌ల సపోర్టు కలిగి ఉంది.
డిస్టాన్స్ విషయంలో రెండు డివైజ్‌లు ఒకే రకమైన 5G బ్యాండ్ సపోర్ట్ కలిగి ఉన్నాయని చెప్పవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470