50MP డ్యూయల్ కెమెరాలతో Nothing Phone 2 విడుదల.. ముందస్తు బుకింగ్‌పై రూ.3000 తగ్గింపు..!
నథింగ్ సంస్థ నుంచి రెండో స్మార్ట్‌ఫోన్ Nothing Phone 2 విడుదల అయింది. ఈ ఫోన్‌కు మూడు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్ ఇస్తామని నథింగ్ సంస్థ వెల్లడించింది. మరియు ప్రతి రెండు నెలలకు ఒకసారి సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇస్తామని, ఇలా 4 సంవత్సరాలపాటు అప్‌డేట్‌లు వస్తాయని పేర్కొంది.
నథింగ్ ఫోన్ 2 డ్యూయల్ నానో సిమ్‌కార్డును కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.7 అంగుళాల పుల్ హెచ్‌డీ+ (1080*2412 పిక్సల్) LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు రీఫ్రెష్ రేట్ 1Hz నుంచి 120Hz వరకు ఉంటుంది. 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంటుంది. HDR10+ ను సపోర్టు చేస్తుంది.

ఈ ఫోన్ క్వాల్‌కాం 4nm స్నాప్ డ్రాగన్ 8+ జెన్1 SoC అడెన్నో 730 GPU చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ OS 2.0 పై పనిచేస్తుంది. ఈ ఫోన్ మూడు హై డెఫినిషన్ మైక్రోఫోన్లు మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్ వ్యవస్థను కలిగి ఉంటుంది.
నథింగ్ ఫోన్ 2 వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. 50MPతోపాటు 1/1.56 అంగుళాల సోనీ IMX890 f/1.88 అపేచర్ మరియు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను కలిగి ఉంటుంది. మరియు 50MP ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 1/2.76 అంగుళాల శాంసంగ్ Jn1 సెన్సార్ సహా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను కలిగి ఉంటుంది. 114 డిగ్రీల ఫీల్డ్ వ్యూతోపాటు f/2.2 అపేచర్‌తో వస్తుంది.
ఈ కెమెరాల ద్వారా 4k వీడియోలను రికార్డు చేయవచ్చు. 480fps స్లో మోషన్ వీడియోలను కూడా రికార్డు చేసుకోవచ్చు. మరియు నథింగ్ ఫోన్ 2 ముందువైపు 32MP కెమెరాతోపాటు 1.2.74 అంగుళాల సోనీ IMX615 సెన్సార్ మరియు f/2.45 అపేచర్‌తో వస్తుంది.

నథింగ్ ఫోన్ 1 తరహాలోనే ఫోన్2 కూడా గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ ఫోన్ 10 కొత్త రింగ్‌టోన్లు, నోటిఫికేషన్ సౌండ్‌లను సపోర్టు చేస్తుందని నథింగ్ సంస్థ పేర్కొంది. బ్యాటరీ ఛార్జింగ్, టైమర్ మాదిరిగా యాప్‌ల ప్రోగ్రస్‌ను చూడవచ్చు. నథింగ్ ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్ WiFi 6, 5G, 4G LTE, బ్లూటూత్ 5.3ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు రెండు యాంబియంట్ లైట్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ 4700mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 45W పీపీఎస్ ఛార్జన్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఛార్జర్‌తో కేవలం 55 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్ చేయవచ్చని నథింగ్ చెబుతోంది. 15W QI వైర్‌లెస్ ఛార్జర్‌తో 130 నిమిషాల్లో ఛార్జింగ్ అవుతుందని తెలిపింది. మరియు 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని నథింగ్ పేర్కొంది.
నథింగ్ ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.44,999గా ఉంది. అదే 12GB ర్యామ్+256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.49,999 మరియు 12GB ర్యామ్+ 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.54,999గా ఉంది. ఈ ఫోన్ డార్క్ గ్రే, వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ జులై 21 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
నథింగ్ ఫోన్ 2 ను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. యాక్సెస్, HDFC బ్యాంక్ డిబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ముందస్తు బుకింగ్ చేసుకుంటే రూ.3000 తగ్గింపు పొందుతారని సంస్థ వెల్లడించింది. నథింగ్ డ్రాప్ స్టోర్‌ల ద్వారా జులై 14 సాయంత్రం 7PM నుంచి ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది. బెంగళూరు నుంచి ఈ సేల్ ప్రారంభం అవుతుందని పేర్కొంది. త్వరలో ఇతర నగరాలకు విస్తరిస్తామని తెలిపింది.


Click it and Unblock the Notifications








