Home
Mobile

50MP+ 50MP కెమెరాలు, 8GB ర్యామ్‌ నథింగ్ ఫోన్‌ 2 పై భారీ తగ్గింపు.. ఈ కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌!!

నథింగ్ ఫోన్‌ 2 భారత్‌ లో (Nothing Phone 2 Smartphone) గత సంవత్సరం జులైలో విడుదల అయింది. విడుదల సమయంలో ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.44,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ భారీ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 చిప్‌సెట్‌ పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ గ్లిఫ్‌ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. మరియు 6.7 అంగుళాల FHD+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్‌ ఫోన్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,499 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.36,499, 12GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.38,999 గా ఉంది. ఈ ఫోన్‌ ప్రస్తుతం వైట్‌ కలర్‌ వేరియంట్‌లోనే అందుబాటులో ఉంది. మిగిలిన కలర్ వేరియంట్‌లు కొనుగోలుకు (Out Of Stock) అందుబాటులో లేవు.

Nothing Phone 2 Smartphone attracts with price drop

ICICI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు. అదే ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు కార్డు ద్వారా కొనుగోలు 5 శాతం తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు 12 నెలలపాటు నో కాస్ట్‌ EMI ప్రయోజనాలను పొందవచ్చు. కనిష్ఠంగా నెలకు రూ.1249 EMI నుంచి అందుబాటులో ఉంది.

నథింగ్‌ ఫోన్ 2 స్పెసిఫికేషన్‌లు :
నథింగ్‌ ఫోన్ 2.. 6.7 అంగుళాల FHD+ LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 1Hz నుంచి 120Hz వరకు రీఫ్రెష్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌తో అందుబాటులో ఉంది. మరియు HDR10+ ను సపోర్టును కలిగి ఉంది.

ఈ నథింగ్‌ ఫోన్‌.. 4nm స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌1 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. Adreno 730 GPU తో జతచేయబడి ఉంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత Nothing OS 2.0 ను కలిగి ఉంటుంది. మూడు సంవత్సరాలపాటు OS అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందవచ్చని సంస్థ తెలిపింది.

ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌) 50MP సోనీ IMX890 ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ 45W ఛార్జింగ్ సపోర్టుతో 4700mAh బ్యాటరీని కలిగి ఉంది. 55 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చు. 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్టుతో 130 నిమిషాల్లో ఛార్జింగ్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 5W రివర్స్‌ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది.

నథింగ్ ఫోన్‌ 2 గ్లిఫ్‌ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ ఫోన్‌ 10 కొత్త రింగ్‌టోన్లు, నోటిఫికేషన్‌ సౌండ్‌లను సపోర్టు చేస్తుందని నథింగ్‌ సంస్థ పేర్కొంది. కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ Wi-Fi 6, బ్లూటూత్ 5.3, 5G, 4G LTE వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు రెండు యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌లతో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing Phone 2 Smartphone price drop on flipkart 2024 specs and sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X