నథింగ్ ఫోన్ 2a కొత్త వేరియంట్ విడుదల.. తొలి రోజు రూ.19,999 కే కొనుగోలు చేయవచ్చు..!
నథింగ్ సంస్థ తాజాగా నథింగ్ ఫోన్ 2a హ్యాండ్‌సెట్ బ్లూ కలర్ వేరియంట్ విడుదల అయింది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ వైట్, బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ కొత్త వేరియంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా మే 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఒక్కరోజు ఆఫర్‌లో భాగంగా రూ.19,999 కే కొనుగోలు చేయవచ్చు.
బహుమతులు గెలుచుకోవచ్చు..!
ఈ ఫోన్ కొనుగోలు సమయంలో Zero Hour పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటన చేసింది. ఈ సమయంలో కొనుగోలు చేసే కస్టమర్లు CMF ఆడియో ఉత్పత్తులను గెలుచుకొనే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. తొలి రోజు ఈ హ్యాండ్‌సెట్ బేస్ వేరియంట్‌ను రూ.19,999 కే కొనుగోలు చేయవచ్చు.

నథింగ్ ఫోన్ 2a ధర వివరాలు :
నథింగ్ ఫోన్ 2a హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ సాధారణ ధర ధర రూ.23,999 గా ఉంది. 8GB ర్యామ్ +256GB అంతర్గత స్టోరేజీ ధర రూ.25,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది.
6.7 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లే :
నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ (Nothing phone 2a Blue Colour Variant) 6.7 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్ సహా 1300 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్ఠంగా 12GB ర్యామ్ మరియు 256GB ర్యామ్‌తో జతచేయబడుతుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ OS 2.5 పైన పనిచేస్తుంది. మూడు సంవత్సరాలపాటు OS అప్‌డేట్లు, నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని నథింగ్ సంస్థ వెల్లడించింది.
32MP సెల్ఫీ కెమెరా :
నథింగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) మరియు EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టును కలిగి ఉంటుంది. మరియు 50MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా మరియు ముందువైపు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఈ నథింగ్ ఫోన్ 2a హ్యాండ్‌సెట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇన్ డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది. USB-C ఛార్జింగ్ పోర్టు, స్టీరియో స్పీకర్లు, IP54 రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌ను కలిగి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications