Home
Mobile

50MP + 50MP+ 50MP కెమెరాలు, 12GB ర్యామ్‌, అదిరిపోయే డిజైన్‌తో Nothing స్మార్ట్‌ఫోన్‌.. 1000 ఫోన్లు మాత్రమే..!

నథింగ్ ఫోన్ 2a ప్లస్‌ కమ్యూనిటీ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ (Nothing Phone 2a plus Community Edition) భారత్‌ మార్కెట్‌లో విడుదల అయింది. స్టాండర్డ్‌ 2a ప్లస్‌ మోడల్‌ ఈ సంవత్సరం తొలి భాగంలో లాంచ్‌ అయింది. ఈ స్పెషల్‌ ఎడిషన్‌ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకుంటుంది. కమ్యూనిటీ ఎడిషన్ ప్రాజెక్ట్ ఈ సంవత్సరం మార్చిలో ప్రారంభం అయింది. హార్డ్‌వేర్‌ డిజైన్‌, వాల్‌పేపర్ డిజైన్‌, ప్యాకేజింగ్‌ డిజైన్ మరియు మార్కెటింగ్‌ వంటి అనేక దశల్లో నథింగ్‌ కమ్యూనిటీ సాయంతో రూపొందించారు.

నథింగ్‌ కమ్యూనిటీ ఎడిషన్‌ హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు గ్రీన్‌ ఫోస్పోరేసెంట్‌ మెటీరియల్‌ కోటింగ్‌తో తయారు చేశారు. చీకట్లో మెరిసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కేవలం 1000 స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. మరియు ఒకే స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

Nothing Phone 2a plus Community edition

నథింగ్‌ ఫోన్ 2a ప్లస్‌ కమ్యూనిటీ ఎడిషన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ నథింగ్ స్పెషల్‌ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల FHD+ ఫ్లెక్సిబుల్‌ అమోలెడ్ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 2412*1084 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 30- 120Hz అడాప్టివ్‌ రీఫ్రెష్‌ రేట్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్‌ 5 రక్షణ పొందుతుంది. HDR10+, 10 బిట్‌ కలర్‌ను సపోర్టు చేస్తుంది.

ఈ నథింగ్‌ స్పెషల్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Nothing OS 2.6 ను కలిగి ఉంది. మరియు ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7350 ప్రో చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ Mali G610 MC4 GPU, 12GB LPDDR4x ర్యామ్ మరియు 25GB UFS 2.2 స్టోరేజీ తో జతచేయబడుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం ఒకే స్టోరేజీ వేరియంట్‌లో విడుదల అయింది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లోనే నథింగ్‌ లాంచ్‌ చేసింది. నథింగ్‌ స్పెషల్‌ ఎడిషన్ హ్యాండ్‌సెట్ 50W ఫాస్ట్‌ ఛార్జింగ్, 5w రివర్స్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), f/1.88 అపేచర్‌తో 50MP శాంసంగ్‌ GN9 ప్రైమరీ కెమెరా, f/2.2 అపేచర్‌తో 50MP అల్ట్రావైడ్‌ కెమెరాలను కలిగి ఉంది. ఈ కెమెరాలతో 30fps వద్ద 4K నాణ్యతతో వీడియోలను రికార్డు చేయవచ్చు. ముందువైపు 50MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ డ్యూయల్‌ సిమ్‌ కార్డులను సపోర్టు చేస్తుంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్‌ 5.3, వైఫై 6, GPS, USB-C, స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ బరువు 190 గ్రాములుగా ఉంది.

నథింగ్ ఫోన్‌ 2a ప్లస్‌ కమ్యూనిటీ ఎడిషన్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. కేవలం 1000 హ్యాండ్‌సెట్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భారత్‌తోపాటు అమెరికా, యూరోప్‌, UK లో కొనుగోలు చేసేందుకు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing Phone 2a plus Community edition launched in india specs features price details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X