Home
Mobile

నథింగ్‌ కొత్త ఫోన్‌ కీలక వివరాలు విడుదల.. గత మోడల్‌ కంటే అప్‌గ్రేడ్‌ ప్రాసెసర్‌తో భారత్‌లో జులై 31న విడుదల..!

నథింగ్‌ ఫోన్‌ 2a ప్లస్ (Nothing Phone 2a Plus Smartphone) మోడల్‌ను గతంలో ప్రకటించిన సంస్థ, గ్లోబల్‌ వేరియంట్‌ను జులై 31న విడుదల చేస్తున్నట్లు గత వారం వెల్లడించింది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ భారత్‌ మార్కెట్‌లో కూడా జులై 31నే లాంచ్‌ కానుందని నథింగ్‌ సీఈవో Carl pei తెలిపారు. దీంతోపాటు ఈ హ్యా్ండ్‌సెట్‌కు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. నథింగ్ ఫోన్‌ 2a కంటే ప్లస్‌ మోడల్‌ 10 శాతం వేగంగా పనిచేస్తుందని తెలిపారు.

నథింగ్‌ ఫోన్‌ 2a ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ చిప్‌సెట్ వివరాలను తాజాగా సంస్థ తన X ప్లాట్‌ఫాం ద్వారా షేర్‌ చేసింది. దీని ఆధారంగా ఈ ప్లస్‌ మోడల్‌ మీడియాటెక్‌ డైమెన్సిటి 7350 ప్రో చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌సెట్‌ స్టాండర్డ్ వేరియంట్‌ కంటే 10 శాతం వేగంగా పనిచేస్తుందని తెలిపింది.

Nothing Phone 2a Plus Smartphone Chipset specifications

దీంతోపాటు Mali G610 MC4 గ్రాఫిక్స్‌ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. నథింగ్‌ ఫోన్‌ 2a కంటే ఈ చిప్‌సెట్ 30 శాతం వేగంగా స్పందిస్తుందని తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్ గరిష్ఠంగా 12GB ర్యామ్‌తో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ర్యామ్‌ బూస్టర్‌ ఫీచర్‌ ద్వారా 20GB వరకు పొడిగించే వీలుందని తెలిపింది.

నథింగ్‌ ఫోన్‌ 2a స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే ప్లస్‌ మోడల్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు అనేక అప్‌గ్రేడ్‌లతో రానుందని తెలుస్తోంది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ గతవారమే టెలికమ్యూనికేషన్స్‌ డిజిటల్‌ గవర్నమెంట్‌ రెగ్యూలేటరీ అథారిటీ మరియు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లో కనిపించింది.

నథింగ్ సంస్థ మార్చిలో ఫోన్‌ 2a ను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత నథింగ్‌ OS 2.5 పైన పనిచేస్తుంది. మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 ప్రో చిప్‌సెట్‌ పైన పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మూడు సంవత్సరాలపాటు OS అప్‌డేట్లు, నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని నథింగ్‌ సంస్థ వెల్లడించింది.

నథింగ్‌ ఫోన్‌ 2a స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సామర్థ్యంతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. విడుదల సమయంలో ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.23999 గా ఉంది.

ఈ ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) మరియు EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టును కలిగి ఉంది. 50MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా మరియు ముందువైపు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing Phone 2a Plus Smartphone Chipset specifications revealed and to launch on july 31 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X