50MP+ 50MP కెమెరాల నథింగ్ ఫోన్ 2a ప్లస్ ఫస్ట్ లుక్ విడుదల... రేపే భారత్‌లో లాంచ్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ నథింగ్ రేపు (జులై 31) భారత్ మార్కెట్‌లో నథింగ్ ఫోన్ 2a ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను (Nothing Phone 2a Plus Smartphone) విడుదల చేయనుంది. ఇప్పటికే వరకు ఈ ఫోన్‌కు సంబంధించిన కెమెరా, చిప్‌సెట్ వివరాలను మాత్రమే ప్రకటన చేయగా.. తొలిసారి ఫోన్ ఫొటోను తన X ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటో ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు డ్యూయల్ 50MP కెమెరాలు సహా 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండనుంది.
ఈ టీజర్ ఆధారంగా నథింగ్ ఫోన్ 2a ప్లస్ .. గ్రే, సిల్వర్‌తో కూడిన డ్యూయల్ టోన్ డిజైన్‌తో అందుబాటులో ఉంటుంది. LED లైట్‌లతో కూడిన గ్లి్‌ఫ్ ఇంటర్‌ఫేస్ మరియు టెక్చర్ డిజైన్‌తో కూడిన అవుట్‌లైన్‌ను గుర్తించవచ్చు. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు కొన్ని లీక్ అయ్యాయి.

నథింగ్ ఫోన్ 2a ప్లస్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7350 Pro చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. మరియు Mali G610 MC4 GPU, 12GB ర్యామ్‌తో జతచేయబడుంది. ర్యామ్ బూస్టర్ ఫీచర్ ద్వారా 20GB వరకు ర్యామ్‌ను వర్చువల్‌గా పొడిగించుకోవచ్చు.
దీంతోపాటు ఈ నథింగ్ కొత్త ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP+ 50MP కెమెరాలతో లాంచ్ కానుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్ 50W వైరడ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది.
అయితే ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే వివరాలు కచ్చితంగా తెలియకపోయినా.. 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ స్టోరేజీ వేరియంట్ వివరాలు తెలియాల్సి ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. బ్లాక్, గ్రే రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది.
నథింగ్ ఫోన్ 2a ప్లస్ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో జులై 31 మధ్యాహ్నం 2.30 గంటలకు విడుదల కానుంది. హ్యాండ్‌సెట్ ధర వివరాలు వెల్లడి కాలేదు. అయితే నథింగ్ ఫోన్ 2a మోడల్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.23,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.25999 మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27999 గా ఉంది.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








